
ట్యాగ్ · 5 కథనాలు


'సీటీమార్' ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్

'సీటీమార్' మంచి విజయం సాధించాలి

'సీటీమార్' ట్రైలర్ రిలీజ్

'పక్కా కమర్షియల్'.. రాశీఖన్నా బర్త్ డే టీజర్ రిలీజ్
ఊహలు గుసగుసలాడే చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన రాశీ ఖన్నా ప్రస్తుతం తెలుగుతో పాటు ఇతర ఇండస్ట్రీల్లో కూడా వరుస సినిమాలతో బిజీ హీరోయిన్ అయిపోయింది. ప్రస్తుతం రాశీ ఖన్నా యాక్షన్ హీరో గోపీచంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో వస్తున్న పక్కా కమర్షియల్ సినిమాలో నటిస్తుంది. ప్రస్తుతం ఈసినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. గతంలో జిల్, ఆక్సీజన్ సినిమాల్లో కలిసి నటించారు గోపీచంద్, రాశీ ఖన్నా. ఇప్పుడు ఈసినిమాలో మరోసారి కలిసి చేస్తున్నారు.

'సీటీమార్' ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్
సంపత్ నంది, గోపీచంద్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా సీటీమార్. కబడ్డీ నేపథ్యంలో యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా వినాయక చవితి పండుగ సందర్భంగా సెప్టెంబర్ 10న రిలీజ్ కానుంది. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా ఇది. ఇప్పటికే టీజర్, ట్రైలర్ తో సినిమాపై అంచనాలు పెంచేశారు. ఇక ఈసినిమాను చూడటానికి ఉన్న ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం..

అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే "సీటీ మార్ "-గోపీచంద్
పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్, తమన్నా జంటగా కబడ్డీ నేపథ్యం లో తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా "సీటీమార్" మూవీ సెప్టెంబర్ 10 వ తేదీ వినాయకచవితి కానుకగా రిలీజ్ కానుంది. హీరో గోపీచంద్, తమన్నాలు ఆంధ్రా, తెలంగాణ కబడ్డీ జట్ల కోచ్‌లుగా నటించిన ఈ మూవీ లో దిగాంగన మరో కథానాయిక. పోసాని కృష్ణ మురళి, రావు రమేష్, భూమిక, రెహమాన్, తరుణ్ అరోరా ముఖ్య పాత్రలలో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు.

'సీటీమార్' మంచి విజయం సాధించాలి
సంపత్ నంది, గోపీచంద్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా సీటీమార్. కబడ్డీ నేపథ్యంలో యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా వినాయక చవితి పండుగ సందర్భంగా సెప్టెంబర్ 10న రిలీజ్ కానుంది. ఇక ఈ నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. దీనిలో భాగంగానే ఇప్పటికే ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇక ట్రైలర్ కూడా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. అంతేకాదు ఈసారి గోపిచంద్ ఖచ్చితంగా హిట్ కొడతాడు అన్న అభిప్రాయానికి వచ్చారు అందరూ.

'సీటీమార్' ట్రైలర్ రిలీజ్
సంపత్ నంది, గోపీచంద్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా సీటీమార్. కబడ్డీ నేపథ్యంలో యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. వినాయక చవితి పండుగ సందర్భంగా ఈసినిమాను సెప్టెంబర్ 10న రిలీజ్ చేస్తున్నట్టు రీసెంట్ గానే ప్రకటించారు మేకర్స్. ఇక ఇప్పటికే ఈసినిమాకు సంబంధించిన పోస్టర్లు, విడుదల అయిన పాటలు సినిమా పై భారీ అంచనాలు పెంచాయి. ఇక తాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఎనర్జిటిక్ హీరో రామ్ చేతుల మీదుగా ఈసినిమా ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఇక ట్రైలర్ కూడా ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.