
ట్యాగ్ · 25 కథనాలు · పేజీ 2


త్వరలో "ఆరడుగుల బుల్లెట్" రిలీజ్

రిలీజ్‌కు సిద్ధమవుతున్న గోపీచంద్ ‘ఆరడుగుల బుల్లెట్`

"అలిమేలు మంగ వేంకటరమణ "మూవీ అప్ డేట్

14 వసంతాల "లక్ష్యం "
శ్రీ లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్ బ్యానర్ పై శ్రీవాస్ దర్శకత్వంలో గోపీచంద్ , అనుష్క జంటగా రూపొందిన "లక్ష్యం "మూవీ 2007 సంవత్సరం జూలై 5వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. జగపతి బాబు ఒక కీలక పాత్రలో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు. కమర్షియల్ ఎలిమెంట్స్‌కు తోడు ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా బాగానే వర్కవుట్ కావడంతో లక్ష్యం సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. హీరో గోపీచంద్ ఫస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన "లక్ష్యం " మూవీ 14 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది.

త్వరలో "ఆరడుగుల బుల్లెట్" రిలీజ్
జై బాలాజీ రియల్ మీడియా బ్యానర్ పై సీనియర్ డైరెక్టర్ బి గోపాల్ దర్శకత్వంలో యాక్షన్ చిత్ర హీరో గోపీచంద్ , లేడీ సూపర్ స్టార్ నయనతార జంటగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ "ఆరడుగుల బుల్లెట్ "మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రకాష్ రాజ్ ,అభిమన్యు సింగ్ , కోట , బ్రహ్మానందం ముఖ్య పాత్రలలో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు.

రిలీజ్‌కు సిద్ధమవుతున్న గోపీచంద్ ‘ఆరడుగుల బుల్లెట్`
మ్యాచో హీరో గోపీచంద్, నయనతార హీరో హీరోయిన్లుగా బి. గోపాల్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఆరడుగుల బుల్లెట్’. నిజానికి 2017లో విడుదలవాల్సిన సినిమా ఇది. కానీ డైరెక్టర్ మారడం.. ఆ తరువాత కొన్ని కారణాల వల్ల ఇంతవరకూ రిలీజ్ కాలేకపోయింది. ఇక ఇన్నేళ్ల తర్వాత ఎట్టకేలకు ఈసినిమా రిలీజ్ కు టైమ్ కలిసొచ్చింది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. థియేటర్స్ రీ ఓపెన్ కాగానే ‘ఆరడుగుల బుల్లెట్` చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా నిర్మాత తాండ్ర రమేష్ ఓన్ రిలీజ్ చేస్తుండటం విశేషం. త్వరలోనే సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌ను…

'పక్కా కమర్షియల్'.. గోపీచంద్ బర్త్ డే పోస్టర్ రిలీజ్
ప్రతీరోజు పండగే వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన మారుతి చాలా గ్యాప్ తరువాత చేస్తున్న సినిమా పక్కా కమర్షియల్. మ్యాచో హీరో గోపీచంద్ ఈసినిమాలో హీరోగా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కొంత వరకూ పూర్తవ్వగా.. పరిస్థితులు కాస్త నెమ్మదిస్తే జూలై నుండి ను కొత్త షెడ్యూల్ ను మొదలు పెట్టాలని చూస్తున్నారు. ఇక రేపు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ సినిమా టీమ్ శుభాకాంక్షలు అందజేస్తూ, స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు.

"అలిమేలు మంగ వేంకటరమణ "మూవీ అప్ డేట్
యాక్షన్ చిత్ర హీరో గోపీచంద్ కథానాయకుడిగా టాలెంటెడ్ డైరెక్టర్ తేజ దర్శకత్వంలో "అలిమేలు మంగ వేంకటరమణ "మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. తేజ దర్శకత్వం లో రూపొందిన సూపర్ హిట్ "నిజం ", "జయం " మూవీస్ లోనెగటివ్ రోల్స్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్న గోపీచంద్ ఇప్పుడు "అలిమేలు మంగ వేంకటరమణ "మూవీ లో హీరోగా నటించడం విశేషం.