
ట్యాగ్ · 5 కథనాలు


ఒక్క సాంగ్ మినహా "రంగ రంగ వైభవంగా" షూటింగ్ పూర్తి
బ్లాక్ బస్టర్ "ఉప్పెన" మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన పంజా వైష్ణవ్ తేజ్ "కొండపొలం" మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. వైష్ణవ్ తేజ్ తన మూడవ సినిమా షూటింగ్ ను కంప్లీట్ చేశారు. బాపినీడు సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్‌పి బ్యానర్‌పై గిరీశాయ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్, కేతిక శర్మ జంటగా "రంగ రంగ వైభవంగా" మూవీ తెరకెక్కుతుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

యూట్యూబ్ ట్రెండింగ్ లో "గుడ్ లక్ సఖి ", "రంగ రంగ వైభవంగా "
దిల్ రాజు సమర్పణలో వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ బ్యానర్ పై నగేష్ కుకునూరు దర్శకత్వం లో కీర్తి సురేష్, ఆది పినిశెట్టి, జగపతి బాబు లు ప్రధాన పాత్రలలో తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా "గుడ్ లక్ సఖి"మూవీ జనవరి 28 వ తేదీన విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియో లు, పాటలు ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి."గుడ్ లక్ సఖి " మూవీ ట్రైలర్ ను చిత్ర యూనిట్ నిన్న రిలీజ్ చేయగా యూట్యూబ్ లో 5 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతోంది.

ఆసక్తిని పెంచుతున్న 'రంగ రంగ వైభవంగా' పోస్టర్
మెగా కాంపౌండ్ నుండి వచ్చిన కొత్త హీరో వైష్ణవ్ తేజ్. ఉప్పెన అంటూ తెలుగు తెరకు పరిచయమైన వైష్ణవ్ తేజ్ మొదటి సినిమాతో సంచలన విజయం దక్కించుకున్నాడు. ఆ సినిమాతో మెగా కాంపౌండ్ లోనే ఎన్నో కొత్త రికార్డులు సృష్టించాడు. ఇక రెండో సినిమాను కొండపొలం అనే డిఫరెంట్ కాన్సెప్ట్ తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆ సినిమాలో కూడా తన నటనతో మెప్పించాడు. దీంతో వైష్ణవ్ తేజ్ సినిమాలంటే అందరికీ ఒక నమ్మకం ఏర్పడేలా చేశాడు. ఇక అప్పుడే మరో సినిమాను రెడీ చేస్తున్నాడు వైష్ణవ్ తేజ్.

'రంగరంగ వైభవంగా' వైష్ణవ్ తేజ్.. టైటిల్ టీజర్ రిలీజ్..!
మొదటి సినిమాతోనే ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు వైష్ణవ్ తేజ్. ఆ సినిమా తరువాత కొండపొలం సినిమాతో వచ్చాడు. ఆ సినిమా కూడా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక ఇప్పుడు మూడో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు వైష్ణవ్ తేజ్. ప్రస్తుతం ‘అర్జున్ రెడ్డి’ తమిళ రీమేక్ డైరెక్టర్ గిరీశాయ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు వైష్ణవ్ తేజ్. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది.

'అర్జున్ రెడ్డి' రీమేక్ డైరెక్టర్ తో వైష్ణవ్ తేజ్
మెగా కాంపౌండ్ నుండి వచ్చి ఒక్క సినిమాతో ఇప్పుడు మెగా ఫ్యామిలీ హీరోస్ కే పోటీ ఇస్తున్నాడు. ఆహీరో ఇంకెవరూ సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్. ఉప్పెన సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న వైష్ణవ్ ఇప్పుడు వరుస సినిమాలను లైన్ లో పెడుతూ బిజీ అయిపోతున్నాడు. అంతేనా పెద్ద పెద్ద బ్యానర్స్ లోనే చాన్స్ లు కొట్టేస్తున్నాడు.