
ట్యాగ్ · 5 కథనాలు


నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న 'బ్రో' మూవీ
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మరియు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం ‘బ్రో’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ జీ స్టూడియోస్ భాగస్వామ్యంతో కలిసి నిర్మించిన ఈ చిత్రానికి ప్రముఖ నటుడు సముద్రఖని దర్శకత్వం వహించారు. జులై 28న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ అయిన ‘బ్రో’ సినిమా పవర్ స్టార్ స్టామినా ఏంటో చూపించింది. విడుదలైన తొలిరోజే రూ.30 కోట్ల షేర్‌ను కొల్లగొట్టడంతో పాటు తర్వాతి రెండు రోజుల్లోనే వంద కోట్ల మార్క్ అందుకుంది. ఈ సినిమాలో ‘టైమ్ ఆఫ్ గాడ్’ పాత్రలో పవన్ కల్యాణ్ చేసిన మ్యాజిక్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. మనిషి జీవితంలో కాలం…

ఓటీటీ లోకి వచ్చేసిన వారసుడు
ఇళయ దళపతి విజయ్ కు తెలుగులో ఎంత ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే తన తమిళ్ సినిమాలను ఇక్కడ డబ్ చేసి మార్కెటింగ్ చేసుకుంటారు మేకర్స్. ఇక రీసెంట్ గా వారసుడు సినిమాను కూడా తెలుగులో రిలీజ్ చేసి మంచి సక్సెస్ అందుకున్నారు. ఈసినిమా తెలుగు డైరెక్టర్ దర్శకత్వం వహించడం విశేషం. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ హీరోగా వచ్చిన సినిమా వారసుడు. తమిళ్ లో వారిసు టైటిల్ తో రిలీజ్ అవ్వగా.. తెలుగులో వారసుడు టైటిల్ తో రిలీజ్ అయింది. తమిళంలో జనవరి 12న, తెలుగులో జనవరి 14న విడుదలైన ఈ సినిమాకి మంచి టాక్ వచ్చింది. ముఖ్యంగా తమిళంలో సూపర్ హిట్‌గా నిలిచింది.

ఓటిటి లో "రాధేశ్యామ్ "మూవీ కి అద్భుత స్పందన
గోపీకృష్ణా మూవీస్ సమర్పణలో యు వి క్రియేషన్స్ , టి సిరీస్ బ్యానర్స్ పై రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , పూజా హెగ్డే జంటగా తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన పీరియాడికల్ లవ్ స్టోరీ “రాధేశ్యామ్ “మూవీ మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. పామిస్ట్ విక్రమాదిత్య గా ప్రభాస్ , డాక్టర్ ప్రేరణ గా పూజాహెగ్డే అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు.”రాధేశ్యామ్ ” మూవీ లో వారిద్దరి కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. దక్షిణాది భాషల వెర్షన్స్ కు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు. హిందీ వెర్షన్ కు మిథున్ సంగీతం అందించారు…

అమెజాన్ లోకి వచ్చిన 'నాట్యం'..!
ఈమధ్య కేవలం కమర్షియల్ సినిమాలే కాదు ప్రయోగాత్మక సినిమాలకు కూడా ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తుంది. అందుకే మేకర్స్ కూడా అలాంటి సినిమాలను చేయడానికి ముందుకొస్తున్నారు. అలా వచ్చిన ఒక సినిమానే నాట్యం. గతంలో సంగీతం, నృత్యం నేపథ్యంలో సినిమాలు వచ్చేవి కానీ ఇప్పుడు చాలా తక్కువయ్యాయి. ప్రస్తుతం భారీ బడ్జెట్.. పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తుండగా.. ఇలాంటి సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం మెచ్చుకోతగిన విషయం. అందుకే ఈసినిమాకు కూడా మంచి ప్రశంసలే దక్కాయి. మెగాస్టార్ చిరు, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు లాంటి ప్రముఖులు కూడా ఈసినిమాను ప్రశంసించారు. అంతేకాదు ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో…

'ఓటీటీ'లోకి వచ్చిన 'కొండపొలం'
కరోనా వల్ల చాలా సినిమాలు ఓటీటీలోనే రిలీజ్ అయ్యాయి. ఈమధ్యనే కరోనా సెకండ్ వేవ్ తరువాత సినిమాలు మళ్లీ థియేటర్లలో రిలీజ్ అవుతున్నాయి. ఇక థియేటర్లలో రిలీజ్ అయినా కూడా ఒకప్పటిలాగ సినిమాలు ఆడే పరిస్థితి లేదు. ఒక వారం రోజులు గట్టిగా ఆడితే గొప్ప అనేలా పరిస్థితి మారిపోయింది. అందుకే థియేటర్లలో రిలీజ్ అయినా కూడా ఎక్కువ రోజులు గ్యాప్ తీసుకోకుండా వెంటనే ఓటీటీలో రిలీజ్ చేసేస్తున్నారు.