ట్యాగ్ · 5 కథనాలు

'దువ్వాడ జగన్నాథం' హిందీ రీమేక్ ప్లాన్..!

3సంవత్సరాల "దువ్వాడ జగన్నాథం "
పుష్పరాజ్ తో పూజా హెగ్డే
బ్లాక్ బస్టర్ దువ్వాడ జగన్నాధమ్ , అల .. వైకుంఠపురములో .. మూవీస్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , పూజా హెగ్డే తమ అద్భుతమైన స్క్రీన్ కెమిస్ట్రీ తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. పూజా హెగ్డే ప్రస్తుతం సర్కస్ , కభీ ఈద్ కభీ దివాలీ (హిందీ )మూవీస్ లో నటిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు #SSMB28, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న జనగణమన మూవీస్ లో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు.శివ దర్శకత్వంలో స్టార్ హీరో సూర్య కథానాయకుడిగా తెరకెక్కనున్న తమిళ మూవీ లో సూర్య కు జోడీగా పూజా హెగ్డే ఎంపిక అయినట్టు సమాచారం. బ్లాక్ బస్టర్ పుష్ప :ది రైజ్ మూవీ…

'దువ్వాడ జగన్నాథం' హిందీ రీమేక్ ప్లాన్..!
హరీష్ శంకర్ లాస్ట్ సినిమా గద్దల కొండ గడేష్. ఆ సినిమా తరువాత ఇంతవరకూ హరీష్ శంకర్ సినిమా మరొకటి రాలేదు. అయితే ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా లైన్ లో ఉంది. అయితే ప్రస్తుతం పవన్ పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. గత ఏడాది వకీల్ సాబ్ సినిమాతో ఖాతా తెరిచిన పవన్ ఈ ఏడాది భీమ్లానాయక్ తో మరో సంచలన విజయం సాధించారు. ప్రస్తుతం పవన్ క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ ను కూడా పూర్తి చేసుకుంది కూడా. ఈసినిమాను కూడా త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నారు.

'పవన్' సంప్రదాయాన్ని పాటిస్తున్న 'బుట్ట బొమ్మ'
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్న స్పెషల్ హ్యాబిట్ గురించి అందరికీ తెలిసిందే కదా. ప్రతి సమ్మర్ వచ్చినప్పుడల్లా ఆయన టాలీవుడ్ లో ఉన్న పలువురు సెలబ్రిటీలకు మామిడి పళ్లను పంపడం అలవాటు. ఈ సంప్రదాయాన్ని ఆయన ఎన్నో యేళ్ల నుండి పాటిస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఆ సంప్రదాయాన్ని పూజాహెగ్డే కూడా పాటిస్తుంది.
యూట్యూబ్ లో అల్లు అర్జున్ 'డీజే' సరికొత్త రికార్డ్
మన తెలుగు సినిమాలు డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్ లో మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే కదా. ఈమధ్య కాలంలో అలా చాలా సినిమాలకే జరిగింది. ఇక తెలుగు సినిమాలు హిందీ లో డబ్బింగ్ అయి యూట్యూబ్ లో రిలీజ్ చేస్తున్నారు. అవి కూడా మిలియన్ వ్యూస్ తోదూసుకుపోతున్నాయి. ఇక ఇదిలా ఉండగా తాజాగా మరో సినిమా 100 మిలియన్స్ ను సొంతం చేసుకొని రికార్డ్ క్రియేట్ చేసింది.

3సంవత్సరాల "దువ్వాడ జగన్నాథం "
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై హరీష్ శంకర్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , పూజాహెగ్డే జంటగా రూపొందిన యాక్షన్ , కామెడీ మూవీ "దువ్వాడ జగన్నాథం" 2017 సంవత్సరం జూన్ 23 వ తేదీ రిలీజ్ అయ్యి కమర్షియల్ గా ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ రోజు తో "దువ్వాడ జగన్నాథం" మూవీ 3 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ కొన్ని ఫొటోస్ ను రిలీజ్ చేసింది. వాటిలో అల్లు అర్జున్ పోలీస్ ఆఫీసర్ గెటప్ లో ఉన్న ఫొటో ప్రేక్షక , అభిమానులను ఆకట్టుకుంది.