ట్యాగ్ · 9 కథనాలు
చరణ్ ను పరిచయం చేయడానికి భయపడ్డా..!
అందరి కన్ను రాజమౌళి షూటింగ్ పైనే..!

షూటింగ్ ప్రారంభించే పనుల్లో జక్కన్న..!
బాలకృష్ణ తో సినిమా చేయాలనుకున్నా కానీ..!
ఆస్కార్ అవార్డ్స్ పై రాజమౌళి స్పందన
‘ఆర్ ఆర్ ఆర్’.. ఇంట్రెస్టింగ్ అప్‌డేట్
మంచి కథ దొరికితే తప్పకుండా చేస్తాం..!
'RRR' ట్రయిల్ షూట్ లో ట్విస్ట్.. క్యాన్సిల్ చేసే ఆలోచనలో రాజమౌళి..!
ప్రభుత్వం ఇచ్చిన నిబంధనలను దృష్టిలో పెట్టుకొని.. వాటిని పాటిస్తూ రాజమౌళి ట్రయిల్ షూట్ నిర్వహించడానికి సిద్ధమైనట్టు గత రెండు రోజులుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. గండిపేట లేదా హైదరాబాద్ శివార్లలోని అల్యూమినియమ్ ఫ్యాక్టరీ సమీపంలో నిర్మించిన సెట్లలో ఈ ట్రయల్ షూట్ జరుగనుందని... ఈ ట్రయల్ షూట్లో మొత్తం 50 మంది సిబ్బందిని మాత్రమే పాల్గొననున్నారని... అంతేకాదు ఈ షూటింగ్ లో తారక్, చరణ్ పాల్గొనడం లేదు. వారికి బదులుగా డూప్ లతో షూట్ ప్లాన్ చేసాడని కూడా అన్నారు. అయితే ఇప్పుడేమైందో తెలియదు కానీ రాజమౌళి తన ట్రయిల్ షూట్ ను క్యాన్సిల్ చేసే ఆలోచనలో వున్నాడట. దీనికి పలు కారణాలే వినిపిస్తున్నాయి. ఒక పక్క ఈ…
చరణ్ ను పరిచయం చేయడానికి భయపడ్డా..!
స్టార్ హీరోల కొడుకులను ఇండస్ట్రీకి పరిచయం చేయడం అంటే డైరెక్టర్స్ కు అంత ఈజీ పని కాదు. అభిమానుల్లో ఎన్నో అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలను రీచ్ అవ్వాలి. అభిమానులు ఎలాంటి ఎలిమెంట్స్ కోరుకుంటారో తెలీదు.. అలా వాళ్ళకి కావాల్సిన అన్ని ఎలిమింట్స్ వుండేలా చూసుకొని.. హీరోని పరిచయం చేస్తారు. ఇక హీరో భవిష్యత్తు అనేది తర్వాత తాను చేసే సినిమాలపై ఆధారపడి ఉంటుంది.
అందరి కన్ను రాజమౌళి షూటింగ్ పైనే..!
లాక్ డౌన్ కారణంగా గత రెండు నెలలుగా షూటింగ్ లు అన్నీ ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ప్రభుత్వాలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో షూటింగ్ లు కూడా మొదలవనున్నాయి. సినిమా థియేటర్లు ఓపెన్ చేసే విషయంలో మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. అనుమతులు అయితే తెచ్చుకున్నారు కానీ ఇప్పట్లో షూటింగ్ లు మొదలు పెట్టడానికి మాత్రం కాస్త ఆలోచిస్తున్నారట. ఎందుకంటే ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది కానీ పలు నిబంధనలు పెట్టడమే దీనికి కారణం. అన్ని నిబంధనలు పాటించి షూటింగ్ చేయాలంటే మరి కష్టమైన పనే కాబట్టి కాస్త వెనక్కి తగ్గుతున్నట్టు తెలుస్తుంది.

షూటింగ్ ప్రారంభించే పనుల్లో జక్కన్న..!
బాహుబలి సినిమా తరువాత రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల కాంబినేషన్ లో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా 'ఆర్ఆర్ఆర్'. స్వాతంత్య్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత చరిత్రలను ఆధారం చేసుకొని రాజమౌళి ఈ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చింది. ఇంకా కొద్దిరోజుల్లో షూటింగ్ పూర్తవుతుంది అనుకునే లోపు కరోనా వల్ల మరో పెద్ద బ్రేక్ వచ్చింది. అయితే రాజమౌళి మాత్రం ఎలాంటి బ్రేక్ లేకుండా ఈ గ్యాప్ లో కుదిరినంత వరకూ పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసుకున్నాడు.
బాలకృష్ణ తో సినిమా చేయాలనుకున్నా కానీ..!
ఒక డైరెక్టర్ కు అందరు హీరోలతో సినిమాలు చేయాలని ఉంటది. ఇక అందరు హీరోలకు కూడా ప్రతి డైరెక్టర్ తో సినిమా చేయాలనుకుంటారు. ఎందుకంటే ఒక్కో డైరెక్టర్ ది ఒక్కో స్టైల్ ఉంటది... ఒక్కో హీరో కి ఒక్కో స్టైల్ ఉంటది. కాబట్టి తమని తాము కొత్తగా ఆవిష్కరించుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఈ నేపథ్యంలో డైరెక్టర్ రాజమౌళి కూడా అగ్ర హీరో అయిన బాలకృష్ణ తో సినిమా చేయాలనుకున్నాడట కానీ కుదరలేదట. ఈ విషయాన్ని జక్కన్న స్వయంగా తానే చెప్పాడు.
ఆస్కార్ అవార్డ్స్ పై రాజమౌళి స్పందన
మూవీ అవార్డ్స్ లో ఆస్కార్ అవార్డ్స్ కు ఒక ప్రత్యేకత ఉంది. మూవీ లోని పలు విభాగాలకు ఆస్కార్ అవార్డ్స్ అందజేయబడతాయి. 2020 సంవత్సరంలో "పారసైట్ " మూవీ ఉత్తమచిత్రం తోపాటు దర్శకుడు, స్క్రీన్ ప్లే విభాగాలలో ఆస్కార్ అవార్డ్స్ గెలుచుకుంది. "పారసైట్ " మూవీ ని వీక్షించిన దర్శకుడు రాజమౌళి తనకు స్లో గా ఉండే మూవీస్ నచ్చవని, బోర్ కొట్టిందని, ఆ మూవీ చూస్తూ పడుకుండిపోయానని కామెంట్ చేశారు.

నెటిజన్స్ కామెంట్స్.. అది నా పర్సనల్ ఒపీనియన్ అంటున్న జక్కన్న..!
ఒక సినిమా అందరికీ నచ్చాలని లేదు. కొంతమందికి నచ్చితే.. అదే సినిమా ఇంకొంతమందికి నచ్చకపోవచ్చు. ఎవరి సొంత అభిప్రాయాలు వాళ్ళకి ఉంటాయి. అలా దర్శక ధీరుడు రాజమౌళికి తన ఒపీనియన్ ను చెప్పడం ఇప్పుడు తప్పయింది కొంతమంది నెటిజన్స్ కు. అసలు సంగతేంటంటే... ఆస్కార్ అవార్డ్ పొందిన పారాసైట్ చిత్రం చూసిన రాజమౌళి దానిపై కాస్త వెటకారంగానే కామెంట్స్ చేశాడు. ఆ సినిమా చూస్తున్నంత సేపు బోరింగ్ ఫీలింగ్ కలిగిందని, చూస్తూ అలానే పడుకుండిపోయానని చెప్పుకొచ్చారు. అంతేకాదు నాకు స్లోగా ఉండే సినిమాలు నచ్చవని కామెంట్స్ చేశారు. ఇక అంతే ఇది చూసిన కొంతమంది నెటిజన్స్ కామెంట్స్ మీద కామెంట్స్ వదిలారు.
‘ఆర్ ఆర్ ఆర్’.. ఇంట్రెస్టింగ్ అప్‌డేట్
కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు.. వీరిద్దరూ వేర్వేరు ప్రాంతాలకు చెందిన పోరాట యోధులు. నిజ జీవితంలో వీరిద్దరూ కలిసినట్లు చారిత్రక ఆధారాలు లేకపోయినా.. కలిస్తే ఎలా ఉంటుంది? అనే వినూత్నమైన ఆలోచనలోంచి పుట్టిన కథకు తెరరూపమే ‘ఆర్ ఆర్ ఆర్’ చిత్రం. దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న ఈ మల్టీస్టారర్ మూవీలో.. కొమరం భీమ్‌గా యంగ్ టైగర్ యన్టీఆర్, అల్లూరిగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్నారు. దాదాపు 80 శాతం చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి కరోనా వైరస్ కారణంగా తాత్కాలికంగా షూటింగ్ బ్రేక్ పడింది. లాక్ డౌన్ అనంతరం.. చిత్రీకరణని పునఃప్రారంభించనున్నారు.
మంచి కథ దొరికితే తప్పకుండా చేస్తాం..!
రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్ లో సినిమా అంటే ఎలా ఉంటుంది. ఒకప్పుడేమో కానీ ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే ఏ రేంజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాహుబలి లాంటి సిరీస్ చేసి తెలుగు సినిమా ఖ్యాతిని మరింత పెంచారు. తెలుగు సినిమా అంటే ప్రాంతీయ సినిమా కాదని రుజువు చేశారు. ఇక ఈ ఇద్దరు మరోసారి జత కలిస్తే ఎలా ఉంటుంది. అది ఎప్పుడు నిజమవుతుందో తెలియదు కానీ ఉహించుకోడానికి మాత్రం సూపర్. ఇప్పుడు సినీ పరిశ్రమలో ఇదే టాక్ వినిపిస్తుంది. దీనికి కారణం ఏంటంటే..