
ట్యాగ్ · 6 కథనాలు


HIT : ది ఫస్ట్ కేస్ హిందీ మూవీ రిలీజ్ డేట్
దర్శకుడు శైలేష్ కొలను అద్భుత ఆఫర్

దీనిని ఒక్కసారి చూస్తే సరిపోదు, ఈ రాత్రికి మళ్ళీ చూడబోతున్నా
పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ 'కల్కి 2898 AD'. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మల్టీలింగ్వెల్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ దీపికా పదుకొణే, దిశాపటానీ కథానాయికలుగా నటించారు. ఇండియన్ లెజెండరీ యాక్టర్స్ అమితాబ్ బచ్చన్ మరియు కమల్‌హాసన్ కీలక పాత్రల్లో కనిపించగా.. బెంగాలీ నటుడు స్వాస్థ్ ఛటర్జీ, రాజేంద్రప్రసాద్, పశుపతి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

సైంధవ్ అభిమానులు, ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారు-శైలేష్ కొలను
విక్టరీ వెంకటేష్ 75 మైల్ స్టోన్, మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘సైంధవ్’. టాలెంటెడ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల వస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు, ట్రైలర్ ట్రెమండస్ రెస్పాన్స్ తో హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేశాయి. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత వెంకట్ బోయనపల్లి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం జనవరి 13న గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో డైరెక్టర్ శైలేష్ కూడా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈసందర్బంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శైలేష్ సైంధవ్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

HIT : ది ఫస్ట్ కేస్ హిందీ మూవీ రిలీజ్ డేట్
హీరో నాని స్వంత బ్యానర్ వాల్ పోస్టర్ సినిమా పై శైలేష్ కొలను దర్శకత్వం లో విశ్వక్ సేన్ , రుహాని శర్మ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన మిస్టరీ యాక్షన్ థ్రిల్లర్ "HIT :ది ఫస్ట్ కేస్ " మూవీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మూవీ తో టాలీవుడ్ కు దర్శకుడిగా శైలేష్ కొలను పరిచయం అయ్యారు. మొదటి మూవీ నే అద్భుతంగా తెరకెక్కించి శైలేష్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. "HIT :ది ఫస్ట్ కేస్ " మూవీ హిందీ రీమేక్ మూవీ తో శైలేష్ బాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
దర్శకుడు శైలేష్ కొలను అద్భుత ఆఫర్
ఒకప్పుడు చిత్ర పరిశ్రమలో ప్రవేశించడానికి చాలా కష్టపడాల్సి వచ్చేది. సోషల్ మీడియా లో ప్రతిభను చాటుకునేవారికి అవకాశాలు వారిని వెతుక్కుంటూ వస్తున్నాయి. టాలెంట్ ఉండీ అవకాశాలు రాని వారు చాలామంది ఉన్నారు. అటువంటి వారికి దర్శకుడు శైలేష్ కొలను అద్భుతమైన అవకాశం కల్పించారు. ఇంట్లోనే ఉండి ఆడిషన్స్ లో పాల్గొనవచ్చని, తమకు నచ్చిన సీన్ లో నటించిన వీడియో ను మెయిల్ చేయమని , ఒక వేళ షార్ట్ ఫిల్మ్ లో నటిస్తే ఆ వీడియోలు ఆడిషన్స్ @ శైలేష్ కొలను .కామ్ కు పంపించమని , పర్సనల్ గా వాటిని పరిశీలించి, తనకు నచ్చిన వారిని ఎంపిక చేసుకుంటానని శైలేష్ చెప్పారు.

శైలేష్ కొలను EXCLUSIVE Interview - ఎక్కువ మంది సినిమా చూడాలన్నదే నా స్వార్ధం
శైలేష్ కొలను డైరెక్టర్‌గా టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో నేచురల్ స్టార్ నాని నిర్మాతగా వచ్చిన 'ఓ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ 'హిట్'. చిన్న సినిమాగా విడుదలై ఈ సినిమా పెద్ద హిట్‌నే అందుకుంది. విడుదలైన మొదటి రోజే మంచి టాక్ తెచ్చుకుంది. కలెక్షన్లు కూడా బాగానే రాబట్టింది. ఇక ఈ సినిమా ఇప్పుడు బాలీవుడ్ లో కూడా రీమేక్ అవ్వబోతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ టాలెంటెడ్ నటుడు రాజ్ కుమార్ రావు నటిస్తున్న ఈ సినిమాను కూడా శైలేష్ కొలనే డైరెక్ట్ చేయనున్నాడు. ఈ సందర్భంగా 'దతెలుగుఫిలింనగర్.కామ్' ఇంటర్వ్యూలో పాల్గొన్న శైలేష్ పలు ఆసక్తికర విషయాలు తెలిపారు. ఆ విశేషాలేంటో ఒకసారి చూద్దాం..
విశ్వక్ సేన్ పై 'హిట్' డైరెక్టర్ కామెడీ - పూరీ సర్ తొక్కేస్తున్నాడు సర్..!
శైలేష్ కొలను దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్ హిట్ సినిమా ఎంత ఘన విజయం సాధించిందో తెలుసు. మొదటి సినిమాతోనే మంచి హిట్ కొట్టాడు శైలేష్ కొలను. ఇక ఈ సినిమా హిందీలో కూడా రీమేక్ కు సిద్ధమైంది. ఈ రీమేక్ కు కూడా శైలేష్ కొలనే దర్శకత్వం వహించనున్నాడు. హిందీ రీమేక్ లో రాజ్ కుమార్ రావు నటిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాను 2021 సంవత్సరంలో సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్టు తెలుస్తుంది.