ట్యాగ్ · 46 కథనాలు · పేజీ 3
యంగ్ హీరోలకు పోటీ ఇస్తున్న విక్రమ్..!
'కోబ్రా' - ఇంటర్‌పోల్ ఆఫీసర్ గా ఇర్ఫాన్..?

కన్ఫామ్ విక్రమ్-ధృవ్ ఒకే సినిమాలో
"మహావీర్ కర్ణ " మూవీ లో విక్రమ్
చియాన్ విక్రమ్ పై శ్రీనిధి శెట్టి ప్రశంసలు
సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై ఆర్ అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో చియాన్ విక్రమ్ హీరోగా సూపర్ నేచురల్ థ్రిల్లర్ "కోబ్రా " తమిళ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో బ్లాక్ బస్టర్ "కె జి ఎఫ్ చాప్టర్ 1 "కన్నడ మూవీ ఫేమ్ శ్రీ నిధిశెట్టి కథానాయిక. క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ , దర్శకుడు కె ఎస్ రవి కుమార్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.
యంగ్ హీరోలకు పోటీ ఇస్తున్న విక్రమ్..!
యంగ్ హీరోలందరూ వర్కౌట్స్ చేస్తూ సిక్స్ ప్యాక్ తో అభిమానులను అలరిస్తున్నారు. ఒకరితో ఒకరు పోటీ పడి మరీ తమ లుక్స్ ను మార్చేసుకుంటున్నారు. యంగ్ హీరోల సంగతి ఓకే.. మరి సీనియర్ హీరోల సంగతేంటి. మేము కూడా వారికి ఏమాత్రం తక్కువ కాదంటున్నారు. మరి తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విక్రమ్ ఫొటో చూస్తే ఎవరైనా ఆ మాట అనక తప్పదు. బ్లాక్ అండ్ వైట్ లో సిక్స్ ప్యాక్ లో ఉన్న విక్రమ్ ఫొటో చూస్తే ఈయన వయసు పెరుగుతుందా? లేక రోజు రోజుకు తగ్గుతుందా అన్న డౌట్ రాక మానదు. విక్రమ్ వయసు ఇప్పుడు 54 ఏళ్లు. కొడుకు ధృవ్ కూడా సినిమాల్లోకి వచ్చాడు. మొదటి సినిమాతో మంచి హిట్ కూడా కొట్టాడు. అలాంటి విక్రమ్ ఇప్పుడు ఈ వయసులో లుక్…
'కోబ్రా' - ఇంటర్‌పోల్ ఆఫీసర్ గా ఇర్ఫాన్..?
జయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో విక్రమ్ 'కోబ్రా' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు రెండు, మూడు గెటప్పుల్లో మాత్రమే అలరించిన విక్రమ్ ఇప్పుడు ఒకటి కాదు రెండు కాదు ఈసారి ఏకంగా 20కు పైగా గెటప్స్ తో వస్తున్నాడు. ఈ సినిమా సగానికి పైగా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. కరోనా వల్ల ప్రస్తుతం షూట్ కి బ్రేక్ పడింది. ఇప్పటికే ఈ సినిమా నుండి పలు పోస్టర్లను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లు సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. ఇక ఈ సినిమాలో క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి కూడా విదితమే.

కన్ఫామ్ విక్రమ్-ధృవ్ ఒకే సినిమాలో
తండ్రీకొడుకులు విక్రమ్, ధృవ్ ఒకే చిత్రంలో నటించనున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు ఈ వార్తలకు బ్రేక్ పడింది. ఈ సినిమాపై ఇప్పుడు అఫిషియల్ ప్రకటన వచ్చేసింది. కార్తీక్ సుబ్బరాజ్ తన ట్విట్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం తాను జగమే తందిరం సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత విక్రమ్-ధృవ్ తో చేస్తున్నానని ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేసాడు. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ పతాకంపై లలిత్ కుమార్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయట. అంతేకాదు ఈ సినిమాలో విక్రమ్ వయస్కుడైన గ్యాంగ్‌స్టర్ పాత్రలో…
"మహావీర్ కర్ణ " మూవీ లో విక్రమ్
యునైటెడ్ ఫిల్మ్ కింగ్ డమ్ బ్యానర్ పై ఆర్ ఎస్ విమల్ దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ చియాన్ విక్రమ్ హీరోగా 300 కోట్ల బడ్జెట్ తో తమిళ, హిందీ భాషలలో "మహావీర్ కర్ణ " మూవీ రూపొందుతుంది. ఈ మూవీ లో కర్ణుడిగా విక్రమ్ నటిస్తున్నారు. హై టెక్నికల్ వేల్యూస్ తో పాన్ ఇండియా మూవీ గా "మహావీర్ కర్ణ " తెరకెక్కుతుంది.

విక్రమ్ 'కోబ్రా' ఫస్ట్ లుక్ రిలీజ్
విభిన్నమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్ విక్రమ్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటి వరకు రెండు, మూడు గెటప్పుల్లో మాత్రమే అలరించిన విక్రమ్ ఇప్పుడు ఏకంగా ఒకటి కాదు రెండు కాదు ఈసారి ఏకంగా 20కు పైగా గెటప్స్ తో వస్తున్నాడు. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో విక్రమ్ 'కోబ్రా' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. సగానికి పైగా ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే టైటిల్ పోస్టర్ తోనే ఇంట్రెస్ట్ ను పెంచగా.. ఇక తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.