తండ్రీకొడుకులు విక్రమ్, ధృవ్ ఒకే చిత్రంలో నటించనున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు ఈ వార్తలకు బ్రేక్ పడింది. ఈ సినిమాపై ఇప్పుడు అఫిషియల్ ప్రకటన వచ్చేసింది. కార్తీక్ సుబ్బరాజ్ తన ట్విట్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం తాను జగమే తందిరం సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత విక్రమ్-ధృవ్ తో చేస్తున్నానని ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేసాడు. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ పతాకంపై లలిత్ కుమార్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయట. అంతేకాదు ఈ సినిమాలో విక్రమ్ వయస్కుడైన గ్యాంగ్స్టర్ పాత్రలో కనిపించబోతున్నారట. ఇక ఆ పాత్రకు సంబంధించిన యువకుడి వయసులో ధృవ్ నటించనున్నట్టు తెలుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Happy to announce that my next directorial after #JagameThandhiram is…. ‘CHIYAAN60’#Chiyaan60
Starring the awesome Chiyaan Vikram Sir & Dhruv Vikram…
And it will be an @anirudhofficial musical..
Produced by @Lalit_SevenScr @7screenstudio
So excited for this film…. pic.twitter.com/Oof0je5Eg4
— karthik subbaraj (@karthiksubbaraj) June 8, 2020
ప్రస్తుతం అజయ్ ఙ్ఞానముత్తు దర్శకత్వంలో కోబ్రా అనే చిత్రంలో నటిస్తున్నాడు విక్రమ్. ఇక ఆదిత్య వర్మ అర్జున్ రెడ్డి తమిళ రీమేక్ ద్వారా విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా పరిచయం అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో ధృవ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. మరి తండ్రీకొడుకులు ఇద్దరూ ఒకే సినిమాలో నటిస్తుండటంతో అప్పుడే సినిమాపై అంచనాలు కూడా ఏర్పడ్డాయి. మరి చూద్దాం
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: