ట్యాగ్ · 7 కథనాలు
బిగ్ బాస్ 4.. అఖిల్-సోహైల్-మెహబూబ్ - దోస్త్ మేరా దోస్త్
మొన్ననామినేషన్స్ తో హీటెక్కిన హౌస్ నిన్న కెప్టెన్సీ టాస్క్ తో వాతావరణం మరింత వేడెక్కింది. ఇక నిన్నటి ఎపిసోడ్ లోకి వెళ్ళిపోతే ఉదయాన్నే ఎవరి పనిలో వారు ఉండగా బిగ్ బాస్ ఎక్కువ లేట్ చేయకుండా కెప్టెన్సీ టాస్క్ ఇచ్చాడు. అమ్మ రాజశేఖర్ వెళ్లిపోవడంతో కెప్టెన్ గా ఎవరూ లేకపోవడంతో బిగ్ బాస్ మళ్లీ కెప్టెన్సీ టాస్క్ ఇచ్చాడు. బాస్కెట్ బాల్స్‌ను గోల్ చేసే టాస్క్ ఇచ్చాడు. ఇందులో ఎవరి బంతిని వాళ్లే కాకుండా మిగతావాళ్లు గోల్ చేయాల్సి ఉంటుంది. బజర్ మోగినప్పుడు ఆలస్యంగా గోల్ చేసిన బంతి మీద ఎవరి ముఖం ఉంటే వాళ్లు అవుట్ అవుతారు. ఆఖరి రౌండ్‌లో గోల్ చేసిన బంతి మీద ఎవరి ముఖం ఉంటే వాళ్లే గెలిచినట్లు.
బిగ్ బాస్ 4 - అరియానా పై అవినాష్ ఫైర్
బిగ్ బాస్ 4 - మొన్న ఇచ్చిన 'పల్లెకు పోదాం ఛలో ఛలో' టాస్క్ నిన్న కూడా అదే కొనసాగింది. ఒకరకంగా నిన్న కంప్లీట్ అవ్వడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు ఆడియన్స్. ఇక నిన్న ఎపిసోడ్ లో స్టార్టింగే తనకు ఆమ్లెట్ కావాలని అరియానా కోరగా కుదరదని అభిజిత్ చెప్పాడు. దీంతో ప్రతిసారి ఆహారం దగ్గరే టాస్క్ ఆపేస్తారని.. ఇందుకే, నీ గేమ్ నచ్చదని అభిజిత్‌ను ముఖం పట్టుకుని అనేసింది. దీంతో అభి.. తెలుసుకుని మాట్లాడు అంటూ సీరియస్ అయ్యాడు. ఇక అరియానా తరపున అమ్మ రాజశేఖర్ కిచెన్ లోకి వెళ్లి ఆమ్లెట్ కావాలని అడగగా దానికి అభి ఆమ్లెట్ ఇవ్వాలంటే ఇంకా ఎక్కువ బియ్యం ఇవ్వాలని చెప్పడంతో మోనాల్ ప్లేటులో పట్టుకున్న…
బిగ్ బాస్ 4 - 'పల్లెకు పోదాం ఛలో ఛలో'
బిగ్ బాస్ 4 - ఇక హాట్ హాట్ గా నామినేషన్ ప్రక్రియ అవ్వడంతో హౌస్ మేట్స్ కాస్త రిలాక్స్ అవుతున్నారు. అది అయ్యేలోపే ఇక ఈరోజు వెంటనే కెప్టెన్సీ టాస్క్ రానే వచ్చింది. ఇక ఎపిసోడ్ స్టార్టింగ్ ఒక యాడ్ ప్రమోషన్ చేయించారు. ఇక అది అయిపోయిన తర్వాత వెంటనే కెప్టెన్సీ టాస్క్ లోకి వెళ్ళిపోయాడు బిగ్ బాస్.
బిగ్ బాస్ 4-జంటలుగా విడిపోయిన హౌజ్‌మేట్స్
బిగ్ బాస్ 4- 54వ రోజు.. నోయల్ బయటికి వెళ్లిపోవడంతో మరో వైల్డ్ కార్డు ఎంట్రీ వచ్చారని.. కాన్ఫెషన్ రూమ్ లో ఉన్నారని.. అరియానా కెప్టెన్ కావడంతో వెళ్లి తీసుకురావాల్సిందిగా బిగ్ బాస్ ఆదేశించాడు. దీనితో అందరూ షాకయ్యారు.. వచ్చేది ఎవరబ్బా అని ఆసక్తిగా ఎదురుచూసారు. అయితే బిగ్ బాస్ చిన్న ట్విస్ట్ ఇచ్చాడు. అరియానా రెండు రోజులు క్రితం చేసిన రిక్వెస్ట్ కు ఇప్పుడు ఆ డాల్ ను పంపించాడు.

బిగ్ బాస్ 4 - 50 రోజులు పూర్తి.. 8వారం నామినేషన్ లిస్ట్ ఇదే
బిగ్ బాస్ 4 - చూస్తుండగానే బిగ్ బాస్ సీజన్ 4 లో 50 రోజులు పూర్తయ్యాయి. 7వారాలు పూర్తయ్యేసరికి హౌస్ లో 11మంది సభ్యులు మాత్రమే మిగిలిఉన్నారు. ఇక నిన్నటి ఎపిసోడ్ లో ఎప్పటిలానే వారివారి పనులతో బిజీ అయ్యారు. మార్నింగ్ మస్తీలో భాగంగా ఒకరిగురించి ఒకరి ఒపీనియన్ ను పేపర్ లో రాసి అభిప్రాయాలు పంచుకున్నారు. దివి వేసిన బిగ్ బాంబ్ ప్రకారం లాస్య కిచెన్‌లో వంట చేస్తూ బిజీ ఉండగా అఖిల్ హెల్ప్ చేస్తున్నాడు. ఆ తర్వాత అభిజిత్‌కు బిగ్ బాస్ టీం వస్తువులతో బట్టలని తిరిగి ఇచ్చేశారు.
బిగ్ బాస్ 4 - మరో వైల్డ్ కార్డ్ ఎంట్రీ
మొదటి రెండు వారాలతో పోల్చుకుంటే బిగ్ బాస్ 4ఈ వారం కాస్త ఇంటరెస్టింగ్ గానే ఉంది అని చెప్పొచ్చు. దానికి కారణం వేరే చెప్పేదేముంది ఫిజికల్ టాస్క్. రోబోలు.. హుమన్స్ మధ్య పెట్టిన ఈ టాస్క్ మంచి రసవత్తరంగానే సాగింది. రోబోలు దివిని కిడ్నాప్ చేయడంతో ఆటలో అసలు మజా అప్పుడు వచ్చింది. దీనికి హుమన్స్ టీమ్ పెద్ద హంగామా చేసినా రోబోలు మాత్రం కూల్ గా ఛార్జింగ్ ను పెట్టుకున్నారు.
బిగ్ బాస్ 4 - మాస్క్ ముఖానికి.. ఎంటర్ టైన్మెంట్ కి కాదు..!
అనుకుంటుండగానే బిగ్ బాస్ 4 వచ్చేసింది. బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ 4 స్టార్ట్ అయిపోయింది. వరుసగా రెండోసారి బిగ్ బాస్‌కి హోస్ట్ చేస్తూ.. ‘ది బ్లాక్ బస్టర్ షో బిగ్ బాస్ బిగెన్.. మాస్క్ ముఖానికి అవసరం, ఎంటర్ టైన్మెంట్‌కి కాదు’ అంటూ ఎంట్రీ ఇచ్చాడు నాగార్జున. అయితే ఈసారి నాగ్ డ్యూయల్ రోల్ చేశారు. వృద్ధుడైన తండ్రిగా, కుమారుడిగా ద్విపాత్రాభినయం చేస్తూ వినోదం అందించే ప్రయత్నం చేశారు. ఇక సీజన్ సీజన్ కు బిగ్ బాస్ హౌస్ లో భారీ మార్పులే వస్తాయి. ఇక ఈసారి బిగ్ బాస్ ఇల్లు గత సీజన్లలో ఎప్పుడూ లేనంత రిచ్ గా కనిపిస్తోంది. డైనింగ్ టేబుల్, హాల్, బెడ్ రూములు…