
ట్యాగ్ · 5 కథనాలు


పూజాహెగ్డే ఎయిర్ పోర్ట్ లుక్

బీస్ట్ థర్డ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూజా హెగ్డే

'బీస్ట్' మూడో షెడ్యూల్ స్టార్ట్

"బీస్ట్ "తమిళ మూవీ సెట్స్ లో పూజాహెగ్డే

అరబిక్ కుతు మరో సెన్సేషన్ రికార్డ్
కొన్ని కొన్ని పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. పాటలకు అర్థాలు తెలియకపోయినా సరే ఎక్కడ చూసినా వినిపిస్తుంటాయి. అలాంటి కోవలోకే వస్తుంది బీస్ట్ సినిమాలోని హలమితి హబీబో పాట. ఈపాటను అరబిక్ కుతు పేరుతో తెలుగులో రిలీజ్ చేశారు. భాషతో సంబంధం లేకుండా ప్రపంచం మొత్తం ఆ సాంగ్ ను వింటున్నారు.. ఆడుతూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సాంగ్కు తమిళంలో హీరో శివకార్తికేయన్ సాహిత్యం అందించగా.. తెలుగులో శ్రీ సాయికిరణ్ సాహిత్యం అందించారు. అనిరుధ్, జోనితా గాంధీ ఆలపించారు. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన ఈ సాంగ్ లో విజయ్, పూజా హెగ్డే సూపర్ డ్యాన్స్ తో అదరగొట్టారు. ఇక ఈపాట ఎంత హిట్టయిందో చూస్తున్నాం. ఇప్పుడు ఈపాట మరో…

పూజాహెగ్డే ఎయిర్ పోర్ట్ లుక్
టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా కొనసాగుతున్న పూజాహెగ్డే కథానాయికగా రూపొందిన ప్రభాస్ “రాధేశ్యామ్ “, అఖిల్ అక్కినేని “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ “ , “ఆచార్య “ మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. బాలీవుడ్ మూవీస్ సల్మాన్ ఖాన్ “భాయిజాన్”, రణ్ వీర్ సింగ్ “సర్కస్ “మూవీస్ లో పూజాహెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. స్టార్ హీరో విజయ్ కు జోడీగా పూజాహెగ్డే ”బీస్ట్ ” తమిళ మూవీ లో నటిస్తున్నారు. పూజాహెగ్డే కథానాయికగా పలు మూవీస్ చర్చల దశలో ఉన్నాయి.

బీస్ట్ థర్డ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న పూజా హెగ్డే
టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్, కోలీవుడ్ లో కూడా వరుస సినిమాలతో కెరీర్ లో చాలా బిజీగా ఉంది పూజా హెగ్డే. ప్రస్తుతం తమిళ్ లో విజయ్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. బీస్ట్ అనే టైటిల్ తో వస్తున్న ఈసినిమా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతుంది. ఇక కరోనా వల్ల ఈసినిమా షూటింగ్ కు బ్రేక్ పడగా ఇటీవలే ఈసినిమా మూడో షెడ్యూల్ ను స్టార్ట్ చేసింది. ఇక ఇప్పుడు తాజాగా పూజా హెగ్డే తన మూడో షెడ్యూల్ ను కూడా పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చెన్నైలో జరుగుతుండగా నిన్నటితో తన షూటింగ్ ను ముగించుకొని ముంబైకు చేరుకుంది ఈ భామ.

'బీస్ట్' మూడో షెడ్యూల్ స్టార్ట్
నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో విజయ్ హీరోగా వస్తున్న సినిమా బీస్ట్. ఇటీవలే విజయ్ పుట్టినరోజు సందర్భంగా ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ పోస్టర్లు రిలీజ్ చేయగా వాటికి సూపర్ రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే మొదటి షెడ్యూల్ జార్జియాలో పూర్తి చేసుకుంది. రెండో షెడ్యూల్‌ను కూడా ఇటీవలే మొదలుపెట్టి అది కూడా పూర్తి చేసుకుంది చిత్రయూనిట్. ఇప్పుడు తాజాగా మూడో షెడ్యూల్ ను స్టార్ట్ చేసినట్టు తెలుస్తుంది. నేడు చెన్నైలో ఈసినిమా మూడో షెడ్యూల్ ను స్టార్ట్ చేయగా.. ఈ షెడ్యూల్ ను త్వరగానే పూర్తి చేయనున్నారట.

"బీస్ట్ "తమిళ మూవీ సెట్స్ లో పూజాహెగ్డే
టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా కొనసాగుతున్న పూజాహెగ్డే కథానాయికగా రూపొందిన “రాధేశ్యామ్ “, “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ “మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. “ఆచార్య “మూవీ లో రామ్ చరణ్ కు జంటగా పూజాహెగ్డే నటిస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ మూవీస్ “కభీ ఈద్ కభీ దివాలీ “, “సర్కస్ “మూవీస్ లో పూజాహెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. స్టార్ హీరో విజయ్ కు జోడీగా పూజాహెగ్డే ”బీస్ట్ ” తమిళ మూవీ లో నటిస్తున్నారు.