
ట్యాగ్ · 5 కథనాలు


తెలుగు భాష పై బాలకృష్ణ ఛాలెంజ్

బాలకృష్ణకు చిరు, ఎన్టీఆర్ బర్త్ డే విషెస్

#NBK107 మూవీ అనౌన్స్ మెంట్

'అఖండ' టీజర్ ట్రీట్ అప్పుడేనా..?

అభిమానులకు బాలకృష్ణ డబుల్ బొనాంజా
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వాస్తవ సంఘటనలతో యాక్షన్ ఎంటర్ టైనర్ “#NBK 107 “మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. శృతి హాసన్ కథానాయిక. వరలక్ష్మి శరత్ కుమార్ , దునియా విజయ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “#NBK 107 “మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుని వైరల్ గా మారింది.సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక మూవీ కి హీరో బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

తెలుగు భాష పై బాలకృష్ణ ఛాలెంజ్
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం మాస్ మసాలా చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ఎంటర్ టైనర్ "అఖండ "మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది. హీరో బాలకృష్ణ బర్త్ డే సందర్భంగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో "#NBK107 "మూవీ అనౌన్స్ అయిన విషయం తెలిసిందే.

బాలకృష్ణకు చిరు, ఎన్టీఆర్ బర్త్ డే విషెస్
మొత్తానికి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసిన నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు వచ్చేసింది. బాలకృష్ణ నేడు తన పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ఇక ఈ సందర్భగా బాలకృష్ణకు సోషల్ మీడియాలో పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు అందరూ. ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రముఖులు కూడా బర్త్ డే విషెస్ అందిస్తున్నారు. మరోవైపు తన సినిమాల అప్ డేట్లతో సోషల్ మీడియాలో నందమూరి హడావుడి మొదలైంది.

#NBK107 మూవీ అనౌన్స్ మెంట్
నందమూరి నటసింహం బాలకృష్ణ ఈ రోజు (జూన్ 10 ) తన 61 వ బర్త్ డే ను జరుపుకుంటున్నారు. హీరో బాలకృష్ణ కు అభిమానులతో పాటు సినీ ప్రముఖుల బర్త్ డే విషెస్ సోషల్ మీడియా లో వెల్లు వెత్తుతున్నాయి. హీరో బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ "అఖండ "మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ కు ప్రేక్షకుల నుండి అద్భుత స్పందన లభించింది. "అఖండ "మూవీ ముగింపు దశలో ఉంది. "అఖండ "మూవీ పై ప్రేక్షక , అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి.

'అఖండ' టీజర్ ట్రీట్ అప్పుడేనా..?
నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ అఖండ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. అయితే ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మే 28న రిలీజ్ కావాల్సింది. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలు ఏ మాత్రం లేవు. దీంతో ఈ సినిమాను సంక్రాంతికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన ఇవ్వనున్నట్టు తెలుస్తుంది.