
ట్యాగ్ · 7 కథనాలు


"రావణాసుర"మూవీలో అను ఇమ్మాన్యుయేల్ లుక్

ట్రెండీ అవుట్ ఫిట్ లో అను ఇమ్మాన్యుయేల్

"మహాసముద్రం"మూవీ లో లాయర్ గా అను ఇమ్మాన్యుయేల్

శిరీష్ 'ప్రేమ కాదంట' డబ్బింగ్ స్టార్ట్

బ్యాక్ టు వర్క్ అంటున్న అను ఇమ్మాన్యుయేల్

అను ఇమ్మాన్యుయేల్ క్యూట్ సెల్ఫీ
స్వప్న సంచారి (2011 ) మూవీ తో బాలనటిగా మలయాళ చిత్ర పరిశ్రమలో కెరీర్ ప్రారంభించిన అను ఇమ్మాన్యుయేల్ , సూపర్ హిట్ యాక్షన్ హీరో బిజు మూవీ తో కథానాయికగా మారారు. మజ్ను మూవీ తో టాలీవుడ్ , తుప్పరివాలన్ మూవీ తో కోలీవుడ్ కు అను పరిచయం అయ్యారు. ఊర్వశివో రాక్షసివో మూవీతో అను విజయం సాధించారు. ఆ మూవీ హిట్ తో అను పలు మూవీ అవకాశాలు అందుకుంటున్నారు.కార్తి జపాన్ (తమిళ ), రావణాసుర మూవీస్ లో అను నటిస్తున్నారు. అను హీరోయిన్ గా పలు మూవీస్ చర్చల దశలో ఉన్నాయి.

"రావణాసుర"మూవీలో అను ఇమ్మాన్యుయేల్ లుక్
అభిషేక్ పిక్చర్స్ , ఆర్ టి టీమ్ బ్యానర్స్ పై సుధీర్ వర్మ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా యాక్షన్ ఎంటర్ టైనర్ “రావణాసుర” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హీరో రవితేజ పది డిఫరెంట్ గెటప్ లలో కనిపించి సర్ ప్రైజ్ చేయబోతున్న ఈ మూవీ లో అను ఇమ్మాన్యుయేల్, ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాష్, పూజిత పొన్నాడ , దక్ష నగార్కర్ కథానాయికలు. ఈ మూవీ కి హర్షవర్ధన్ రామేశ్వర్ , భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.ఇప్పటికే చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

రవితేజ ‘రావణాసుర ప్రారంభం.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్..!
రవితేజ మాత్రం తన స్పీడును అస్సలు తగ్గించట్లేదు. ఒక సినిమా లైన్ లో ఉండగానే మరో సినిమాను లైన్ లో పెట్టేస్తున్నాడు. ఇప్పటికే రవితేజ లిస్ట్ లో నాలుగైదు సినిమాలు ఉన్నాయి. అయినా కూడా కొత్త కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నాడు. ప్రస్తుతం 'ఖిలాడి' చిత్రం చిత్రీకరణ పూర్తి చేసుకోగా 'రామారావు ఆన్ డ్యూటీ' షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాను త్రినాధరావు నక్కిన డైరెక్ట్ చేస్తున్నారు. ఇంకా వంశీ అనే డైరెక్టర్ తో టైగర్ నాగేశ్వరరావు అనే సినిమాలో కూడా నటిస్తున్నాడు.

ట్రెండీ అవుట్ ఫిట్ లో అను ఇమ్మాన్యుయేల్
“యాక్షన్ హీరో బిజు “మూవీ తో అను ఇమ్మాన్యుయేల్మఅను ఇమ్మాన్యుయేల్లయాళ చిత్ర పరిశ్రమకు కథానాయికగా పరిచయం అయ్యారు. “మజ్ను ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన అను “కిట్టు ఉన్నాడు జాగ్రత్త “మూవీ తో ప్రేక్షకులను అలరించారు. సూపర్ హిట్ “తుప్పరివాలన్ “మూవీ తో అను కోలీవుడ్ లో అడుగు పెట్టారు. యాక్షన్ హీరో గోపీచంద్ “ఆక్సిజన్ “, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “అజ్ఞాతవాసి “, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ “నా పేరు సూర్య “, నాగచైతన్య “శైలజా రెడ్డి అల్లుడు “, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ “అల్లుడు అదుర్స్ ” మూవీస్ లో అను కథానాయికగా నటించి తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించారు.

"మహాసముద్రం"మూవీ లో లాయర్ గా అను ఇమ్మాన్యుయేల్
సూపర్ హిట్ “RX 100 ” మూవీ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా ఎ కె ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ అక్టోబర్ 14 వ తేదీ రిలీజ్ కానుంది. హీరో సిద్ధార్ధ్ ఒక కీలక పాత్రలో నటించారు. అదితి రావు హైదరి , అను ఇమ్మాన్యుయేల్ కథానాయికలు కాగా జగపతి బాబు , రావు రమేష్ ముఖ్య పాత్రలలో నటించారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు. “మహాసముద్రం” చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ , సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచాయి.

శిరీష్ 'ప్రేమ కాదంట' డబ్బింగ్ స్టార్ట్
రాకేశ్ శశి దర్శకత్వంలో యంగ్ హీరో అల్లు శిరీష్, మల్లూ బ్యూటీ అను ఇమ్మాన్యుయేల్ జంటగా వస్తున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ వస్తున్న సంగతి తెలిసిందే. ప్రీ లుక్స్ తోనే తన సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాడు అల్లు శిరీష్. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. ఇక ఒక పక్క షూటింగ్ జరుపుకుంటూనే మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మొదలుపెట్టారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే ఈసినిమా డబ్బింగ్ మొదలుపెట్టినట్టు శిరీష్ తన ఇన్ట్సా ద్వారా తెలియచేశాడు. అంతేకాదు.. ఇంకా ఒక షెడ్యూల్ షూటింగ్ మిగిలి ఉందని కూడా తెలిపాడు.

బ్యాక్ టు వర్క్ అంటున్న అను ఇమ్మాన్యుయేల్
యంగ్ హీరో అల్లు శిరీష్, మల్లూ బ్యూటీ అను ఇమ్మాన్యుయేల్ జంటగా ప్రేమ కాదంట అనే రొమాంటిక్ ఎంటర్ టైనర్ వస్తున్న సంగతి తెలిసిందే. రాకేశ్ శశి దర్శకత్వం వహిస్తున్న ఈసినిమా టైటిల్ ను ఫస్ట్ లుక్ ను అల్లు శిరీష్ బర్త్ డే సందర్భంగా ఇటీవలే రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఇక ఈసినిమా పోస్టర్లతోనే అంచనాలు పెంచేసింది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉండగా కరోనా సెకండ్ వేవ్ వల్ల షూట్ కు బ్రేక్ పడింది. అయితే ఇప్పుడు మళ్లీ పరిస్థితులు కాస్త నార్మల్ కు రావడంతో అందరూ షూటింగ్ ను మొదలుపెడుతున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ఈసినిమా షూట్ ను కూడా స్టార్ట్ చేసింది చిత్రయూనిట్. దీనిలో భాగంగానే మళ్లీ వర్క్ లో జాయిన్ అయింది…