
ట్యాగ్ · 6 కథనాలు

నితిన్ 'అంధాధున్ రీమేక్' రిలీజ్ డేట్ ఫిక్స్
"అంధాధున్ "మలయాళ రీమేక్ ప్రారంభం
"అంధాధున్ " తమిళ రీమేక్ లో ఐశ్వర్య రాయ్ ?

నితిన్ హిందీ రీమేక్ లాంచ్

ఆగస్ట్ లో హీరో నితిన్ కొత్త చిత్రం ప్రారంభం
శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నితిన్ , నభా నటేష్ జంటగా బాలీవుడ్ బ్లాక్ బస్టర్ “అంధాధున్ ” మూవీ తెలుగు రీమేక్ “మాస్ట్రో ” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. స్టార్ హీరోయిన్ తమన్నా ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. “మాస్ట్రో ” మూవీ మేజర్ షూటింగ్ షెడ్యూల్ గోవా లో జరుగుతుండగా కరోనా సెకండ్ వేవ్ కారణం గా షూటింగ్ నిలిచిపోయింది. దర్శకుడు మేర్లపాక గాంధీ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ .. “మాస్ట్రో ” మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉందనీ , 7 రోజుల షూటింగ్ పార్ట్ బ్యాలెన్స్ ఉందనీ చెప్పారు.
నితిన్ 'అంధాధున్ రీమేక్' రిలీజ్ డేట్ ఫిక్స్
వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ రాజా లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ మేర్లపాక గాంధీ. ఆ తర్వాత వచ్చిన `కృష్ణార్జున యుద్ధం` ఆశించిన విజయం సాధించలేకపోయింది. ఈ నేపథ్యంలో చాలా గ్యాప్ తీసుకొని ఇప్పుడు నితిన్ తో 'అంధాధున్ రీమేక్' చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా టైటిల్ కూడా ఇంకా ప్రకటించకముందే తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. జూన్ 11న చిత్రం విడుదల కానుందని అధికారికంగా తెలియచేసారు.
"అంధాధున్ "మలయాళ రీమేక్ ప్రారంభం
తెలుగు , తమిళ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తున్న రాశీఖన్నా , ప్రస్తుతం 3 తమిళ మూవీ షూటింగ్స్ తో బిజీగా ఉన్నారు. ఒక తమిళ వెబ్ సిరీస్ “అంధాధున్ “మలయాళ రీమేక్ మూవీ లో కథానాయికగా ఎంపిక అయ్యారు. ఒక మూవీ లో రాశీఖన్నా , సాయి తేజ్ కు జోడీగా ఎంపిక అయ్యారనీ , ఒక హిందీ వెబ్ సిరీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.రాశీఖన్నా తన లేటెస్ట్ ఫొటో షూట్ ఫొటోస్ , వర్కౌట్ వీడియోస్ ను సోషల్ మీడియా లో షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే.
"అంధాధున్ " తమిళ రీమేక్ లో ఐశ్వర్య రాయ్ ?
శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వంలో ఆయుష్మాన్ ఖురానా హీరోగా రూపొందిన బాలీవుడ్ మూవీ "అంధాధున్ " ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ మూవీ లో సీనియర్ హీరోయిన్ టబు నెగటివ్ షేడ్స్ ఉన్న ఒక కీలక పాత్రలో నటించారు. ఇప్పుడు "అంధాధున్ " మూవీ పలు భాషలలో రీమేక్ అవుతుంది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నితిన్ హీరోగా "అంధాధున్ " మూవీ తెలుగు లో రీమేక్ కానుంది. హిందీ లో టబు నటించిన పాత్రకు తమన్నా ఎంపిక అయ్యారు. "అంధాధున్ " మూవీ ఇప్పుడు తమిళ భాషలో రీమేక్ కానుంది.

నితిన్ హిందీ రీమేక్ లాంచ్
ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రలో బాలీవుడ్ లో తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ 'అంధాదున్' భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిన ఈ సినిమాలో అంధుడిగా చేసిన ఆయుష్మాన్ తన నటనతో విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకున్నాడు. ఇక ఈ సినిమాను తెలుగులో కూడా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.
క్రిస్మస్ సీజన్ లో నితిన్ - మేర్లపాక గాంధీ చిత్రం?
హిందీలో ఘనవిజయం సాధించిన `అంధాదూన్` చిత్రం... తెలుగులో రీమేక్ కానున్న సంగతి తెలిసిందే. యువ కథానాయకుడు నితిన్ హీరోగా నటించనున్న ఈ సినిమాని `వెంకటాద్రి ఎక్స్ ప్రెస్`, `ఎక్స్ ప్రెస్ రాజా` చిత్రాల దర్శకుడు మేర్లపాక గాంధీ తెరకెక్కించనున్నాడు. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళనుంది. అంతేకాదు... రిలీజ్ డేట్ ని కూడా లాక్ చేశారట. వినిపిస్తున్న కథనాల ప్రకారం... క్రిస్మస్ కానుకగా సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు యూనిట్ సన్నాహాలు చేస్తోందట. త్వరలోనే ఈ రీమేక్ కి సంబంధించి పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడి కానున్నాయి.