
ట్యాగ్ · 6 కథనాలు


రవితేజ 'ఖిలాడి' ట్రైలర్ రిలీజ్

'ఖిలాడి' చంద్రకళ గా అనసూయ..!

"ఫ్లాష్ బ్యాక్ " మూవీ డబ్బింగ్ లో అనసూయ

అనసూయ స్టన్నింగ్ లుక్

కల నెరవేరింది - అనసూయ
సక్సెస్ ఫుల్ యాంకర్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న అనసూయ పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. టాలెంటెడ్ యాక్ట్రెస్ అనసూయ ప్రస్తుతం “ఆచార్య ““రంగమార్తాండ “,“ఫ్లాష్ బ్యాక్ ”, “పక్కా కమర్షియల్ ” “గాడ్ ఫాదర్ ” మూవీస్ లో కీలక పాత్రలలో నటిస్తున్నారు.మమ్ముట్టి హీరోగా తెరకెక్కిన సూపర్ హిట్ “భీష్మ పర్వం “ మూవీ తో అనసూయ మలయాళ చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు.

రవితేజ 'ఖిలాడి' ట్రైలర్ రిలీజ్
గత ఏడాది క్రాక్ తో మంచి సూపర్ హిట్ కొట్టిన మాస్ మహారాజా రవితేజ ఆ సినిమా తరువాతవరుసగా సినిమాలను చేస్తున్నాడు. రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడి సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరోవైపు ఈ సినిమా ఫిబ్రవరి 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న నేపథ్యంలో ఇంకా రిలీజ్ కు తక్కువ రోజులు ఉండటంతో వీలైనంత ఎక్కువగా ఈసినిమా ప్రమేషన్స్ చేయడానికి ఫిక్స్ అయ్యారు మేకర్స్. దానిలో భాగంగానే వరుసగా పోస్టర్లు రిలీజ్ చేస్తున్నారు.. ఇంకా వరుసగా పాటలను కూడా విడుదల చేస్తున్నారు చిత్ర బృందం. ఇప్పటికే ఐదు పాటలను రిలీజ్ చేశారు. అందులో…

'ఖిలాడి' చంద్రకళ గా అనసూయ..!
రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా వస్తున్న సినిమా ఖిలాడి. ఈసినిమాను ఫిబ్రవరి 11న రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రిలీజ్ కు ఇంకా ఎన్నో రోజులు లేకపోవడంతో ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే వరుసగా ఈసినిమాలో నటించే కీలక నటీనటుల పోస్టర్లను వరుసగా రిలీజ్ చేస్తున్నారు చిత్రయూనిట్. ఇప్పటికే అర్జున్, అలానే విలన్ పాత్రలో చేస్తున్నఅనూప్ సింగ్ పోస్టర్లను రిలీజ్ చేయగా తాజాగా అనసూయ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో అనసూయ 'చంద్రకళ' పాత్రలో కనిపించనుంది. అయితే ఈసినిమాలో కూడా రవితేజకి అత్త పాత్రలో నటిస్తుందని అంటున్నారు. ఇక అనసూయ పోస్టర్…

"ఖిలాడి "మూవీ నుండి యంగ్ విలన్ పోస్టర్ రిలీజ్
పెన్ మూవీస్ , ఏ స్టూడియోస్ బ్యానర్స్ పై సూపర్ హిట్ “రాక్షసుడు” మూవీ ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “ఖిలాడి” మూవీ 2022 ఫిబ్రవరి 11 వ తేదీ రిలీజ్ కానుంది. మీనాక్షి చౌదరి , డింపుల్ హాయతి కథానాయికలు. యాక్షన్ కింగ్ అర్జున్ , ఉన్ని ముకుందన్ , రావు రమేష్ , మురళీశర్మ , వెన్నెల కిషోర్ , అనసూయ ముఖ్య పాత్రలలో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

"ఫ్లాష్ బ్యాక్ " మూవీ డబ్బింగ్ లో అనసూయ
అభిషేక్ ఫిలిమ్స్ బ్యానర్‌పై డాన్ శ్యాండీ దర్శకత్వంలో పి. రమేష్ పిళ్ళై నిర్మాతగా ప్రభుదేవా, రెజీనా, అనసూయ, ఆర్యన్ ప్రధాన పాత్రలలో"ఫ్లాష్ బ్యాక్" తమిళ మూవీ తెరకెక్కింది. శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్ అధినేత, నిర్మాత ఎ.ఎన్ బాలాజీ గుర్తుకొస్తున్నాయి అనే ట్యాగ్‌లైన్ తో "ఫ్లాష్ బ్యాక్" మూవీ ని తెలుగులో రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ శరవేగంగా జరుగుతున్నట్లుగా చిత్రయూనిట్ తెలిపింది. అందులో భాగంగా యాంకర్, నటి అనసూయ తన పాత్రకు డబ్బింగ్ చెబుతున్న ఫొటోలను చిత్రయూనిట్ విడుదల చేసింది.

అనసూయ స్టన్నింగ్ లుక్
తన అద్భుతమైన యాంకరింగ్ తో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న స్టార్ యాంకర్ అనసూయ నటన కు ప్రాధాన్యత ఉన్న మూవీస్ ను సెలక్ట్ చేసుకుని వెండితెర ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ “రంగస్థలం“మూవీ లో రంగమ్మత్త గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్న టాలెంటెడ్ యాక్ట్రెస్ అనసూయ ప్రస్తుతం“పుష్ప“, “రంగమార్తాండ “, “ఖిలాడి “, “భీష్మ పర్వం “(మలయాళ ) మూవీస్ లో కీలక పాత్రలలో నటిస్తున్నారు.