
ట్యాగ్ · 25 కథనాలు · పేజీ 2


నాగచైతన్య కొత్త ప్రయోగం..!

థ్యాంక్యూ.. జులై చివరికి కంప్లీట్ చేయాలి

"థ్యాంక్ యూ " మూవీ లో 3 గెటప్స్ లో నాగచైతన్య

13B హార్రర్ సీక్వెల్ లో చైతు..?

"థ్యాంక్యూ " మూవీ షూటింగ్ పూర్తి
నాగచైతన్య హీరోగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “మనం “మూవీ ఫేమ్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో సింక్ సౌండ్ టెక్నాలజీ తో “థ్యాంక్యూ " మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో అందాల రాశీఖన్నా, మాళవిక నాయర్ కథానాయికలు. హీరోయిన్ అవికా గోర్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం , పి సి శ్రీరామ్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు.

నాగచైతన్య కొత్త ప్రయోగం..!
అక్కినేని వారసత్వంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాగ చైతన్య తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు విభిన్నమైన సినిమాలు చేస్తూ కెరీర్ లో దూసుకుపోతుంది. ప్రస్తుతం ఆయన వరుస సినిమాలతో బిజీగా ఉండగా.. అందులో విక్రమ్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న ‘థాంక్యూ’ సినిమా ఒకటి. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఇదిలా ఉండగా ఈసినిమాలో నాగచైతన్య పాత్ర గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తుంది. ఈసినిమాలో చైతన్య మూడు విభిన్నమైన పాత్రల్లో నటిస్తున్నాడన్న టాక్ బలంగా వినిపిస్తోంది. అంటే మూడు మూడు విభిన్నమైన వయస్సులో ఆయన్ని దర్శకుడు చూపించనున్నాడట. ఈ వార్త అయితే ఇప్పుడు బలంగా…

థ్యాంక్యూ.. జులై చివరికి కంప్లీట్ చేయాలి
మనం’తర్వాత హీరో నాగచైతన్య, దర్శకుడు విక్రమ్ కె. కుమార్ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘థ్యాంక్యూ’. ఇక ఈసినిమా కూడా షూటింగ్ దశలోనే ఉంది. కరోనా పరిస్థితుల్లో కూడా ఇటలీ షెడ్యూల్ ను చాలా కష్టపడి ముగించుకొని వచ్చారు చిత్రయూనిట్. ఇక ఇప్పుడిప్పుడే పరిస్థితులు కాస్త నెమ్మదిస్తుండటంతో మళ్లీ షూటింగ్ లకు ప్లాన్ చేస్తున్నారు అందరూ. ఈనేపథ్యంలోనే ఈసినిమా షూటింగ్ ను తొందరగా కంప్లీట్ చేయాలని చూస్తున్నట్టు తెలుపుతున్నాడు విక్రమ్.

"థ్యాంక్ యూ " మూవీ లో 3 గెటప్స్ లో నాగచైతన్య
నేషనల్ అవార్డ్ విన్నర్ శేఖర్ కమ్ముల బ్లాక్ బస్టర్ "ఫిదా " మూవీ తరువాత నాగచైతన్య , సాయి పల్లవి జంటగా రొమాంటిక్ ఎంటర్ టైనర్ "లవ్ స్టోరీ " మూవీ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. హీరో నాగచైతన్య తెలంగాణ యువకుడిగా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది. కరోనా కారణం గా "లవ్ స్టోరీ " మూవీ షూటింగ్ వాయిదా పడింది. భారీ అంచనాలు ఉన్న ఈ మూవీ తరువాత నాగచైతన్య మరో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

13B హార్రర్ సీక్వెల్ లో చైతు..?
మాధవన్, నీతూ చంద్ర ప్రధాన పాత్రల్లో...విక్రమ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన 13B ఎంత మంచి విజయం దక్కించుకుందో తెలుసు. 2009లో విక్రమ్ కుమార్ తెరకెక్కించిన ఆ సినిమా, తెలుగులోను విజయాన్ని అందుకుంది. ఈ సినిమా మొదటి నుండి చివరి వరకు ఉత్కంఠపరిచే థ్రిల్లింగ్ మూమెంట్స్ తో.. ట్విస్ట్ లతో మంచి సస్పెన్స్ ను క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు ఈ సినిమా గురించిన ఉపోద్ఘాతం ఎందుకంటారా..? అసలు సంగతేంటంటే ఈ హార్రర్ థ్రిల్లర్ కు సీక్వెల్ రానున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే... ఈ సీక్వెల్ లో నాగ చైతన్య హీరో గా నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.