
ట్యాగ్ · 7 కథనాలు


"రొమాంటిక్"మూవీ లో హీరో రామ్ గెస్ట్ రోల్

'రొమాంటిక్' నుండి మరో ట్రైలర్ రిలీజ్

'రొమాంటిక్' ట్రైలర్ రిలీజ్

"రొమాంటిక్ " మూవీ సెన్సార్ పూర్తి

పేరు మారింది అంటున్న ఆకాష్ పూరి
సాధారణంగా హీరో హీరోయిన్లు కెరీర్ లో కలిసిరానప్పుడు పేర్లు మార్చుకోవడం చూస్తుంటాం. ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీలు తమ లక్ కోసం పేర్లను మార్చుకున్నారు. ఇప్పుడు మరో కుర్ర హీరో కూడా తమ పేరులో మార్పును చేసుకున్నాడు. ఆ కుర్ర హీరో ఎవరో కాదు డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ. బాలనటుడిగా పలు సినిమాల్లో నటించిన ఆకాష్ పూరీ మెహబూబా సినిమాతో హీరోగా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఆ తరువాత రొమాంటిక్, చోర్ బజార్.. సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఏ సినిమా కూడా మంచి హిట్ ను అందించలేకపోయాయి. ప్రస్తుతం అయి ఆకాష్ పూరీ పలు సినిమాలను లైన్ లో పెట్టినట్టు తెలుస్తుంది.

"రొమాంటిక్"మూవీ లో హీరో రామ్ గెస్ట్ రోల్
పూరి కనెక్ట్స్ బ్యానర్ పై అనిల్ పాదూరి దర్శకత్వంలో ఆకాష్ పూరి, యూట్యూబర్ , సింగర్, మోడల్, ఢిల్లీ బ్యూటీ కేతిక శర్మ జంటగా తెరకెక్కిన “రొమాంటిక్” మూవీ అక్టోబర్ 29 వ తేదీ రిలీజ్ కానుంది. సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ ఒక కీలక పాత్రలో నటించారు. సునీల్ కశ్యప్ సంగీతం అందించారు. ఈ మూవీ కి దర్శకుడు పూరి జగన్నాథ్ స్టోరీ , స్క్రీన్ ప్లే , డైలాగ్స్ అందించడం విశేషం. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , సాంగ్స్ , ట్రైలర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

'రొమాంటిక్' నుండి మరో ట్రైలర్ రిలీజ్
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కిన సినిమా రొమాంటిక్. అనిల్ పాడూరి దర్శకత్వంలో వస్తున్న ఈసినిమా ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 29న విడుదలవుతుంది. ఈనేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్స్ లో కూడా స్పీడు పెంచారు. ఒకపక్క పూరీ లైగర్ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నా కూడా తనయుడి కోసం ప్రమోషన్స్ కోసం తన సపోర్ట్ ను అందిస్తూనే ఉన్నారు. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ ను ట్రైలర్ ను రిలీజ్ చేయగా అవి బాగానే ఆకట్టుకున్నాయి. ఇక ఇప్పుడు ఈసినిమా నుండి మరో ట్రైలర్ ను రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఇక ఈసారి రిలీజ్ చేసిన ట్రైలర్ లో క్రైమ్ యాంగిల్స్ ను చూపించారు.

'రొమాంటిక్' ట్రైలర్ రిలీజ్
డాషింగ్ డైరెక్టర్ పూరీజగన్నాథ్ డైరెక్షన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్ లో ఎంతో మంది హీరోలకు బ్లాక్ బస్టర్ హిట్స్ అందించడమే కాకుండా ఎంతో మంది స్టార్ హీరోలను చేశాడు. ఇక ఇప్పుడు తనయుడు ఆకాష్ పూరి సక్సెస్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నాడు పూరీ. పూరీ తనయుడు ఆకాష్ పూరీ ఇప్పటికే రెండు మూడు సినిమాలు చేసినా సరైన సక్సెస్ రాలేదు. ఇక ఇప్పుడు రొమాంటిక్ సినిమాతో తన అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకోవడానికి వస్తున్నాడు. అనిల్ పాడూరి దర్శకత్వంలో ఈ సినిమా వస్తుంది. ఇక ఈసినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దమైంది. నిజానికి ఈసినిమాను దీపావళి పండుగ సందర్భంగా నవంబర్ 4 న…

"రొమాంటిక్ " మూవీ సెన్సార్ పూర్తి
పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్స్ పై అనిల్ పాదూరి దర్శకత్వంలో ఆకాష్ పూరి , కేతిక శర్మ జంటగా యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ "రొమాంటిక్ " మూవీ విడుదలకు సిద్ధం గా ఉంది. సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ ఒక కీలక పాత్రలో నటించగా మందిరా బేడి , మకరంద్ దేశ్ పాండే , దివ్య దర్శిని ముఖ్య పాత్రలలో నటించారు. సునీల్ కశ్యప్ సంగీతం అందించారు. గోవా లోని అందమైన లొకేషన్స్‌లో చిత్రీకరణ జరుపుకున్న "రొమాంటిక్ " మూవీకి స్టోరీ , స్క్రీన్ ప్లే , డైలాగ్స్ పూరి జగన్నాథ్ అందించడం విశేషం.
అభిమానులకు ఆకాష్ పూరీ విన్నపం.. మళ్లీ కలుస్తామని నమ్ముతున్నా..!
లాక్ డౌన్ వల్ల సెలబ్రిటీస్ అందరూ తమ పుట్టిన రోజు వేడుకులకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. అంతేకాదు తమ అభిమానులకు కూడా పుట్టినరోజు వేడుకలు జరపొద్దని... ప్రస్తుతం పరిస్థితులు బాలేదని.. అందరు ఇళ్లలోనే వుంటూ జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నారు. ఇక ఇప్పుడు డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ కూడా తన అభిమానులకు అదే పిలుపునిస్తున్నాడు.
నాన్న డైలాగ్స్ తో ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటున్న ఆకాష్ పూరీ..!
టాలీవుడ్ లో ఉన్న డైరెక్టర్ లలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్ ఉంటుంది. వారిలో డాషింగ్ డైరెక్టర్ పూరీ స్టైల్ ఇంకా సెపరేట్. నిజ జీవితానికి దగ్గర ఉండే విధంగా తన డైలాగ్స్ ఉంటాయి. అందుకే అందరూ పూరీ సినిమాలంటే అంత ఇష్టపడతారు. ఇక పూరీ వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు పూరీ తనయుడు ఆకాష్ పూరీ. ఇప్పటికి రెండు మూడు సినిమాలు చేసినా సరైనా విజయం దక్కించుకోలేకపోయాడు.