కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Actor Ravi Teja

ట్యాగ్ · 65 కథనాలు · పేజీ 4

షూటింగ్ అప్‌డేట్

క్రాక్ నుండి రవితేజ కొత్త స్టిల్ రిలీజ్ - చివరి షెడ్యూల్ ప్లాన్

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మాస్ మహారాజ్ రవితేజ హీరోగా క్రాక్ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లో జ‌రిగిన కొన్ని ఘ‌ట‌న‌ల‌ను ఆధారంగా చేసుకొని గోపీచంద్ మలినేని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా చివరి దశలో ఉండగా కరోనా వల్ల బ్రేక్ పడింది. ఇక ఇప్పటీకే విడుదల చేసిన ర‌వితేజ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌కు, టీజ‌ర్‌కు చాలా మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

మాస్ టైటిల్ తో రవితేజ మూవీ ?

మాస్ మహారాజా రవితేజ ప్రతీ సినిమాలో తనదైన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ తో ప్రేక్షక , అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. హీరో రవితేజ నటించిన మూవీస్ జయాపజయాలతో సంబంధంలేకుండా రవితేజ పై క్రేజ్ ఉన్న ప్రేక్షకులు ఆయన నటనను ఆస్వాదిస్తారు. రవితేజ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నిజ జీవిత సంఘటనలతో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ "క్రాక్ " మూవీ లో నటిస్తున్నారు. ఈ మూవీ తోపాటు రవితేజ మరికొన్ని మూవీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

పెట్ డాగ్స్ తో రవితేజ

లాక్ డౌన్ లో మన టాలీవుడ్ సెలబ్రిటీస్ అందరూ ఇంట్లోనే ఉంటూ కాలక్షేపం చేస్తున్నారు. ఇప్పటికే వారు రోజూ చేసే పనులు ఎప్పటికప్పుడూ సోషల్ మీడియా ద్వారా తెలుపుతూనే ఉన్నారు. ముఖ్యంగా చాలా మంది తమ పెట్ డాగ్స్ తో సరదాగా ఆడుకుంటూ ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మాస్ మహారాజ్ కూడా తన పెట్ డాగ్స్ కు సంబంధించి ఒక ఫొటోను పోస్ట్ చేసాడు. తన డాగ్స్ ను ప్రేమతో తలపై నిమురుతూ.. దానికి మై బాయ్స్ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

డాక్టర్ పాత్రలో శృతి హాసన్

సరస్వతి ఫిల్మ్స్ డివిజన్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా నిజ జీవిత సంఘటనలతో యాక్షన్ ఎంటర్ టైనర్ "క్రాక్ " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. శృతి హాసన్ కథానాయిక. వరలక్ష్మి శరత్ కుమార్ , సముద్ర ఖని , అలీ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. గోపీచంద్ మలినేని , రవితేజ కాంబినేషన్ లో రూపొందిన "డాన్ శీను ", "బలుపు " మూవీస్ ఘనవిజయం సాధించాయి. వారిద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా "క్రాక్ " తెరకెక్కుతుంది.

Team TFNవాట్సాప్
Mass Maharaja Ravi Teja To Play The Role Of A Detective In His Upcoming Movie
సినిమా వార్తలు

డిటెక్టివ్ పాత్రలో రవితేజ ?

"విక్రమార్కుడు ", పవర్ " వంటి సూపర్ హిట్ మూవీస్ లో మాస్ మహారాజా రవితేజ పోలీస్ ఆఫీసర్ గా నటించి ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నిజ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ "క్రాక్ " మూవీ లో రవితేజ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు. ఎటువంటి క్యారెక్టర్ లో నైనా తనదైన స్టైల్ లో నటించి ప్రేక్షకులను అలరిస్తున్న రవితేజ ఇప్పుడు మరో కొత్త క్యారెక్టర్ లో నటించనున్నారు.

Team TFNవాట్సాప్

షేర్