
ట్యాగ్ · 5 కథనాలు


కరోనా వ్యాప్తి నివారణకై నిఖిల్ సందేశం

మంచు తుఫాన్ లో చిక్కుకుపోయిన 'కార్తికేయ2' టీమ్

విదేశాలకు నిఖిల్ 'కార్తికేయ2'
యంగ్ హీరో నిఖిల్ కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో నిఖిల్ 18 పేజీస్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా నుండి ఇప్పటికే పలు పోస్టర్లు రిలీజ్ అవ్వగా అవి డిఫరెంట్ గా ఉండి ఆకట్టుకున్నాయి. సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై రానున్న ఈ చిత్రాన్ని బన్నీ వాసు నిర్మిస్తున్న ఈసినిమాకు.. సుకుమార్ రైటింగ్స్ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నాడు.

కరోనా వ్యాప్తి నివారణకై నిఖిల్ సందేశం
కరోనా మహమ్మారి ఎఫెక్ట్ తో షూటింగ్స్ నిలిచిపోయి , థియేటర్స్ మూతబడి , రిలీజ్ లు ఆగిపోయి చిత్రపరిశ్రమ పలు విధాలుగా నష్టపోయిన విషయం తెలిసిందే. 9 నెలల తరువాత చిత్ర పరిశ్రమ షూటింగ్స్ తో కళ కళ లాడింది. తిరిగి కరోనా సెకండ్ వేవ్ తో షూటింగ్స్ నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. మూవీ రిలీజ్ లు వాయిదా పడ్డాయి. యంగ్ హీరో నిఖిల్ కథానాయకుడిగా రూపొందుతున్న "కార్తికేయ 2 ", "18 పేజెస్ " మూవీ షూటింగ్స్ నిలిచిపోయాయి.

మంచు తుఫాన్ లో చిక్కుకుపోయిన 'కార్తికేయ2' టీమ్
చందు మెుండేటి కాంబినేషన్ లో నిఖిల్ హీరోగా కార్తికేయ 2 వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఇటీవలే గుజరాత్ షెడ్యుల్ లో నిఖిల్ కు గాయమవ్వగా .. ఇప్పుడు షూటింగ్ కు మరో అడ్డంకి వచ్చింది. కార్తికేయ 2 షూటింగ్ కొన్ని రోజులుగా హిమాచల్ ప్రదేశ్‌లోని సిస్సులో జరుగుతుంది. హీరో నిఖిల్, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్‌తో పాటు ఇతర నటీనటులు కూడా అక్కడే ఉన్నారు.
డైరెక్షన్ పై నిఖిల్ క్లారిటీ - ఇప్పుడే డైరెక్ట్ చేయను
హీరో నిఖిల్ డైరెక్టర్ గా మారబోతున్నాడని.. ఒక ఎక్స్పెరిమెంటల్ చిల్డ్రన్ సినిమాను డైరెక్ట్ చేయనున్నాడని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. అయితే ఇప్పుడు ఆవార్తలపై స్పందించిన నిఖిల్ తన డైరెక్షన్ పై క్లారిటీ ఇచ్చాడు.
ఎక్స్పపరిమెంటల్ సినిమాతో డైరెక్టర్ గా మారనున్న నిఖిల్..!
లాక్ డౌన్ లో ఒక్కో సెలబ్రిటీ ఒక్కో కొత్త విషయాన్ని నేర్చుకునే పనిలో పడ్డారు. కొంతమంది తాము మధ్యలో వదిలేసిన కళలను నేర్చుకున్నారు. ఈ నేపథ్యంలో యంగ్ హీరో నిఖిల్ కూడా రైటింగ్ కు సంబంధించి ఆన్ లైన్ క్లాసెస్ ద్వారా మెళకువలు నేర్చుకున్న సంగతి తెలిసిందే. అంతేకాదు రైటింగ్ పై దృష్టి పెట్టి కథను కూడా రాసిన సంగతి విదితమే. రైటింగ్ ‘లైఫ్ లో కొత్త అడ్వెంచర్’ అంటూ అప్పుడే ట్విట్టర్ లో తెలిపాడు. .