లాక్ డౌన్ లో ఒక్కో సెలబ్రిటీ ఒక్కో కొత్త విషయాన్ని నేర్చుకునే పనిలో పడ్డారు. కొంతమంది తాము మధ్యలో వదిలేసిన కళలను నేర్చుకున్నారు. ఈ నేపథ్యంలో యంగ్ హీరో నిఖిల్ కూడా రైటింగ్ కు సంబంధించి ఆన్ లైన్ క్లాసెస్ ద్వారా మెళకువలు నేర్చుకున్న సంగతి తెలిసిందే. అంతేకాదు రైటింగ్ పై దృష్టి పెట్టి కథను కూడా రాసిన సంగతి విదితమే. రైటింగ్ ‘లైఫ్ లో కొత్త అడ్వెంచర్’ అంటూ అప్పుడే ట్విట్టర్ లో తెలిపాడు. .
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఒక టీవీ షో లో పాల్గొన్న నిఖిల్ త్వరలోనే డైరెక్టర్ గా మారబోతున్నట్టు తెలిపాడు. ఒక ఎక్స్పెరిమెంటల్ చిల్డ్రన్ సినిమా తెరకెక్కించనున్నట్టు కూడా తెలిపాడు. తక్కువ మంది స్టాఫ్ తో.. ఒక ఐదుగురు పిల్లలతో సినిమా తీస్తున్నట్టు తెలిపాడు. మరి హ్యాపీ డేస్ కంటే ముందు నిఖిల్ హైదరాబాద్ నవాబ్స్ అనే సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన సంగతి తెలిసిందే. చూద్దాం మరి డైరెక్టర్ గా నిఖిల్ ఏం చేస్తాడో.
ప్రస్తుతం నిఖిల్, చందు మెుండేటి కాంబినేషన్ లో వచ్చిన ‘కార్తికేయ’ సీక్వెల్ ‘కార్తికేయ2’ సినిమా చేస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం పై నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్నారు. పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో “18పేజీస్” సినిమాలో కూడా నటిస్తున్నాడు. గీతా ఆర్ట్స్2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై ఈ సినిమా రూపొందుతుంది. ఇక కరోనా కారణంగా ఈ మూవీస్ షూటింగ్స్ ఆగిపోయాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: