
ట్యాగ్ · 5 కథనాలు

'ఆది పురుష్' విజువల్స్ చూశా.. ఫ్యాన్స్ కు పండగే..!
పాన్ ఇండిాయ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. ఇక ప్రభాస్ సినిమాల నుండి అప్ డేట్స్ కోసం అభిమానులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కు పూరీ తనయుడు ఆకాష్ పూరీ చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తిని పెంచేశాయి. ఆకాష్ పూరీ హీరోగా చోర్ బజార్ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా ఈనెల 24వ తేదీన రిలీజ్ కానున్నసంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు ఆకాష్.

"చోర్ బజార్ " మూవీ టైటిల్ సాంగ్ రిలీజ్
వి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై "జార్జ్ రెడ్డి" మూవీ ఫేమ్ జీవన్ రెడ్డి దర్శకత్వంలో ఆకాశ్ పూరి హీరోగా పాతబస్తీ నేపథ్యంలో "చోర్ బజార్ " మూవీ తెరకెక్కుతుంది. గెహ్నా సిప్పీ కథానాయిక. సుబ్బరాజు , సునీల్ , సంపూర్ణేష్ బాబు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా "చోర్ బజార్ " మూవీ నుండి టైటిల్ సాంగ్ రిలీజ్ అయ్యింది.

మారిన 'రొమాంటిక్' రిలీజ్ డేట్
కరోనా సెకండ్ వేవ్ తరువాత పెండింగ్ లో ఉన్న చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయితే కొన్ని సినిమాలకు మాత్రం ఇంకా రిలీజ్ మోక్షం కలగలేదు. అందులో పూరీ తనయుడు ఆకాష్ పూరి సినిమా రొమాంటిక్ కూడా ఒకటి ఉంది. ఈసినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సిఉంది కానీ ఇంతవరకూ రిలీజ్ కు నోచుకోలేదు. అయితే ఇటీవలే ఈసినిమా కొత్త రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. దీపావళి పండుగ సందర్భంగా ఈసినిమాను నవంబర్ 4న రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది చిత్రయూనిట్. అయితే ఇప్పుడు మళ్లీ ఏమైందో తెలియదు కానీ కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించారు. అక్టోబర్ 29న ఈసినిమా రిలీజ్ చేస్తున్నట్టు మరోసారి అధికారికంగా ప్రకటించారు.

దీపావళి రేస్ లో 'రొమాంటిక్' మూవీ.. రిలీజ్ డేట్ ఫిక్స్
అనిల్ పాడూరి దర్శకత్వంలో పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కుతున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ 'రొమాంటిక్'. ఇక ఈసినిమా కూడా ఎప్పుడో రిలీజ్ కావాలి కానీ ఇంతవరకూ రిలీజ్ కాలేకపోయింది. ముందు కరోనా వల్ల రిలీజ్ వాయిదా పడినా ఆ తరువాత కూడా పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఇంకా ఆలస్యం అయింది. ఇప్పటికే ఎన్నో రిలీజ్ లు వాయిదా పడగా.. ఇక తాజాగా మరోసారి ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. దీపావళి పండుగ సందర్భంగా ఈసినిమాను నవంబర్ 4న రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది చిత్రయూనిట్.

"రొమాంటిక్ " మూవీ అప్ డేట్
పూరి కనెక్ట్స్ (పూరి జగన్నాథ్ &ఛార్మి ) బ్యానర్ పై అనిల్ పాదూరి దర్శకత్వంలో ఆకాష్ పూరి హీరోగా రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్"రొమాంటిక్ " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. మోడల్ కేతిక శర్మ కథానాయిక. సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. మందిరా బేడీ , మకరంద్ , దివ్యదర్శిని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. సునీల్ కశ్యప్ సంగీతం అందించారు. "రొమాంటిక్ " మూవీకి స్టోరీ , స్క్రీన్ ప్లే , డైలాగ్స్ ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ అందించారు.