
ట్యాగ్ · 5 కథనాలు


'సాయిపల్లవి' లేడీ పవన్ కళ్యాణ్..!

'ఆడవాళ్ళు మీకు జోహార్లు' టీజర్ రిలీజ్

ఫిబ్రవరిలో సందడి చేయనున్న సినిమాలు..!

'ఆడవాళ్ళు మీకు జోహార్లు' రివ్యూ.. ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్..!
ఓవరాల్ గా చెప్పాలంటే ఈమధ్య ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ రావడం చాలా అరుదైపోయింది. ఈనేపథ్యంలో ఆడవాళ్ళు మీకు జోహార్లు లాంటి ఫ్యామిలీ ఎంటర్ టైన్ తో వచ్చిన శర్వా సినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్ ముఖ్యంగా ఆడవాళ్లు కనెక్ట్ అవుతారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

'సాయిపల్లవి' లేడీ పవన్ కళ్యాణ్..!
ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది సాయి పల్లవి. చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఏది వస్తే ఆపాత్ర కాకుండా.. తనకు నచ్చిన పాత్రలు మాత్రమే చేస్తూ తన అందం, అభినయం, డ్యాన్స్ తో కోట్లాదిమంది ఫాలోవర్లను సంపాదించుకుంది. కేవలం సినిమాల ద్వారా మాత్రమే కాదు.. రియల్ లైఫ్ లో కూడా సాయిపల్లవి బిహేవియర్ పై ఎంతో మంది ప్రశంసలు కురిపిస్తుంటారు. ఇక ఇప్పుడు తాజాగా క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ కూడా సాయిపల్లవిపై ప్రశంసలు కురిపించారు.

'ఆడవాళ్ళు మీకు జోహార్లు' ట్రైలర్ రిలీజ్ కి డేట్ ఫిక్స్..!
హిట్టు ఫ్లాపులతో పని లేకుండా వరస సినిమాలు చేస్తూ వెళుతున్నాడు యంగ్ హీరో శర్వానంద్. ప్రస్తుతం శర్వానంద్ నటిస్తోన్న లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ `ఆడవాళ్ళు మీకు జోహార్లు`. కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈసినిమా ఈనెల 25న రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ మొదలుపెట్టేశారు మేకర్స్. ఇక టైటిల్ తోనే సినిమాపై బజ్ క్రియేట్ చేసిన చిత్రయూనిట్.. పాటలు, టీజర్‌తో ఈ సినిమా మీద అంచనాలు మరింత పెంచేశారు. ఇక తాజాగా ఈసినిమా ట్రైలర్ రిలీజ్ చెయ్యడానికి డేట్ ఫిక్స్ చేశారు. ఈ సినిమా ట్రైలర్ ని ఈ ఫిబ్రవరి 19న రిలీజ్ చేస్తున్నట్టుగా అధికారికంగా ప్రకటించారు.

'ఆడవాళ్ళు మీకు జోహార్లు' టీజర్ రిలీజ్
కిషోర్ తిరుమల దర్శకత్వంలో యంగ్ హీరో శర్వానంద్ హీరోగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా రూపొందుతున్న చిత్రం 'ఆడవాళ్లు మీకు జోహార్లు'. ఈసినిమా ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. దీనిలో భాగంగానే ఇప్పటికే విడుదల అయిన పోస్టర్ల తో పాటు ఒక పాట కూడా రిలీజ్ అవ్వగా అవి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. ఇక తాజాగా ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. పెళ్లి అయినా, పండగ అయినా, మన 'చిరు' జీవితం అయినా... సందడి అంతా ఆడవాళ్లదే అంటూ టీజర్ ను రిలీజ్ చేశారు. ఇక టీజర్ లో పెళ్లి కోసం శర్వానంద్ ఎన్ని తిప్పలు పడతాడో చూపించారు చిత్ర దర్శకుడు…

ఫిబ్రవరిలో సందడి చేయనున్న సినిమాలు..!
నెలరోజుల నుండి టాలీవుడ్ లో కాస్త టెన్షన్ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. పెద్ద సినిమాలు అన్నీ సంక్రాంతికి తమ రిలీజ్ లను రెడీ చేసుకోగా ఒక్కసారిగా థర్డ్ వేవ్ ప్రభావం ఎక్కువవడంతో రిలీజ్ లను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. మళ్లీ ఒక రెండు నెలల వరకూ సినిమా రిలీజ్ లు ఆగిపోతాయేమో అనుకున్నారు అందరూ. అయితే మేకర్స్ మాత్రం ధైర్యం చేసి ఈనెల నుండే సినిమా రిలీజ్ లను మొదలుపెట్టారు. గత రెండు రోజులుగా దాదాపు టాలీవుడ్ పెద్ద సినిమాలతో పాటు మినిమం బడ్జెట్ సినిమాలు, చిన్న సినిమాల రిలీజ్ డేట్లు వచ్చేశాయి. ఈనేపథ్యంలో ఈనెల లో చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడికి రెడీ అవుతున్నాయి.