ఫిబ్రవరిలో సందడి చేయనున్న సినిమాలు..!

Telugu Movies Releasing In February,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Vishal Movies,Vishal New Movie,Vishal Samanyudu,Vishal Samanyudu Movie,Vishal Samanyudu Movie Trailer,Vishal Samanyudu Movie Updates,Vishal Movie On Feb 4th, #Vishal,2022 Telugu Trailers,Latest Telugu Movie Trailers 2022,Latest Telugu Movies 2022,Ravi Teja Khiladi​ Movie,Ravi Teja Khiladi​ Movie Updates,Ravi Teja Khiladi February, Ravi Teja Khiladi February 11th,Ravi Teja Khiladi Movie Updates,Ravi Teja Khiladi upcoming Movie,Ajith Valimai Movie on February 24th,Ajith Valimai Movie Upcoming on February 24th, Pawan Kalyan Bheemla Nayak,Pawan Kalyan Bheemla Nayak Movie on 25th February,Pawan Kalyan Bheemla Nayak Upcoming Movie,Ghani Movie,Varun Tej Ghani Movie,Varun Tej Ghani Movie on 25th February, Aadavallu Meeku Johaarlu,Aadavallu Meeku Johaarlu Movie,Aadavallu Meeku Johaarlu Movie In February,Sharwanand Aadavallu Meeku Johaarlu Movie,Aadavallu Meeku Johaarlu Movie Uodates, Aadavallu Meeku Johaarlu Upcoming Movie In February,Sebastian PC 524 Kiran Abbavaram,Kiran Abbavaram Sebastian PC 524,Kiran Abbavaram Sebastian PC 524 in February

నెలరోజుల నుండి టాలీవుడ్ లో కాస్త టెన్షన్ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. పెద్ద సినిమాలు అన్నీ సంక్రాంతికి తమ రిలీజ్ లను రెడీ చేసుకోగా ఒక్కసారిగా థర్డ్ వేవ్ ప్రభావం ఎక్కువవడంతో రిలీజ్ లను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. మళ్లీ ఒక రెండు నెలల వరకూ సినిమా రిలీజ్ లు ఆగిపోతాయేమో అనుకున్నారు అందరూ. అయితే మేకర్స్ మాత్రం ధైర్యం చేసి ఈనెల నుండే సినిమా రిలీజ్ లను మొదలుపెట్టారు. గత రెండు రోజులుగా దాదాపు టాలీవుడ్ పెద్ద సినిమాలతో పాటు మినిమం బడ్జెట్ సినిమాలు, చిన్న సినిమాల రిలీజ్ డేట్లు వచ్చేశాయి. ఈనేపథ్యంలో ఈనెల లో చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడికి రెడీ అవుతున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈనెలలో ముందుగా సందడి చేయడానికి రెడీ అవుతుంది విశాల్. శరవణన్ దర్శకత్వంలో విశాల్ హీరోగా వస్తున్న సామాన్యుడు సినిమా ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈసినిమా పై మంచి అంచనాలే ఉన్నాయి. కాగా సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ పతాకంపై నిర్మిస్తున్నారు.

మరోవైపు ఇదే నెలలో రిలీజ్ అవుతున్న సినిమాల లిస్ట్ లో రవితేజ ఖిలాడి, డీజే టిల్లు కూడా ఉన్నాయి. ఈ రెండు సినిమాలు కూడా ఒకే రోజు రానున్నాయి. ఫిబ్రవరి 11వ తేదీన ఈ రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈరెండు సినిమాలపై మంచి క్రేజే ఉంది. క్రాక్ సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు రవితేజ, ఇక సిద్దూ జొన్నలగడ్డ కూడా కృష్ణ అండ్ హిజ్ లీలా సినిమాతో హిట్ ను సొంతం చేసుకొని జోష్ లో ఉన్నాడు. మరి వీరిద్దరి మధ్య జరుగుతన్న పోటీలో ఎవరు సక్సెస్ అవుతారో చూడాలి.

ఇక అటు తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో వాలిమై కూడా ఒకటి. కరోనా వల్ల ఈసినిమా షూటింగ్ పూర్తవ్వడానికి ఎక్కువ టైమ్ పట్టింది. ఇక షూటింగ్ అయిన వెంటనే మిగిలిన పనులు త్వరగా పూర్తి చేసి ఇప్పుడు రిలీజ్ కు సిద్దం చేశారు. ఈసినిమా ఫిబ్రవరి 24న రిలీజ్ అవుతుంది.

ఇక ఈనెలలో సినీ లవర్స్ కు ఇంపార్టెంట్ డేట్ ఏదన్నా ఉందంటే అది ఫిబ్రవరి 25. ఆరోజు అయితే చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో కూడా ఒకటి రెండు సినిమాలు తప్పితే అన్నీ పెద్ద సినిమాలే. వాటిలో ముందుగా చెప్పుకోవాల్సింది పవన్ కళ్యాణ్ భీమ్లానాయక్ సినిమా గురించి. పవన్ సినిమా కాబట్టి ఈసినిమాకు ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక దీనితో పాటు.. గని, ఆడవాళ్ళు మీకు జోహార్లు, సెబాస్టియన్ పీసీ524 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే వీటిలో భీమ్లానాయక్, గని సినిమాలు మాత్రం రెండు రిలీజ్ డేట్లను ఫిక్స్ చేసుకున్నాయి. ఈనేపథ్యంలో ఫిబ్రవరి 25 నే రిలీజ్ అవుతాయా.. లేక వేరే తేదీల్లో రిలీజ్ అవుతాయా అన్నది మాత్రం తెలియదు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 3 =