దసరా దిశగానే వీరమల్లు అడుగులు

pawan kalyan hari hara veera mallu movie release date plan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో హరిహర వీరమల్లు సినిమా. అయితే ఈసినిమా కోసం ఎంతలా వెయిట్ చేస్తున్నారో అంతలా లేట్ అవుతుంది. మరోవైపు పవన్ మాత్రం వేరే సినిమాలను పూర్తి చేసుకుంటూ వెళుతున్నాడు. అలా మొదలుపెట్టాడో లేదో సముద్రఖని దర్శకత్వంలో వస్తున్న సినిమాలో తన షూటింగ్ పార్ట్ ను పూర్తి చేశాడు. ఈనేపథ్యంలోనే హరిహర వీరమల్లు పరిస్థితి ఏంటా అని అందరూ అనుకుంటున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఈసినిమా షూటింగ్ ఎప్పుడో మొదలుపెట్టారు చిత్రయూనిట్. ఇప్పటికే చాలా వరకూ షూటింగ్ ను కూడా పూర్తి చేసుకుంది. కానీ మధ్యలో బ్రేక్ పడింది. మళ్లీ ఈమధ్యన ఈసినిమా షూటింగ్ ను మళ్లీ మొదలుపెట్టారు. అయితే ఇప్పుడు మళ్లీ బ్రేక్ పడింది. త్వరలోనే మళ్లీ మొదలుపెట్టి పూర్తి చేయనున్నట్టు తెలుస్తుంది. దీంతో గత కొంతకాలంగా ఏప్రిల్ లో రిలీజ్ చేస్తారని అనుకున్నారు కానీ అది కుదరదు. ఈనేపథ్యంలో మరో వార్త తెరపైకి వచ్చింది. ఈ సినిమాను దసరాకి రిలీజ్ చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్టుగా సమాచారం. ఎలాగైనా దసరాకు బరిలో దించాలని చూస్తున్నారట. చూద్దాం మరి ఏం జరుగుతుందో..

ఇక పవన్ కెరీర్ లోనే వస్తున్న మొదటి పాన్ ఇండియా సినిమా కాబట్టి ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అందులోనూ పీరియాడిక్ యాక్షన్‌ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఇదివ‌ర‌కెన్నడూ క‌నిపించ‌ని పాత్రలో సంద‌డి చేయ‌బోతుండటంతో ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దానికి తోడు ఇప్పటికే విడుద‌లైన హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు పోస్టర్లు, గ్లింప్స్ వీడియోలు సినిమాపై క్యూరియాసిటీని పెంచాయి.

కాగా ఈసినిమాలో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు జోడీగా నిధి అగ‌ర్వాల్ నటిస్తుండగా.. అర్జున్‌ రాంపాల్‌ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాలో ఒక కీలక పాత్రకోసం బాబీ డియోల్ కూడా నటిస్తున్నట్టు తెలుస్తుంది.
ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం తన మెగా సూర్యా ప్రొడ‌క్షన్ బ్యానర్‌పై ఈ సినిమాను సమర్పిస్తున్నారు. ప్రముఖ సంగీత ద‌ర్శకుడు యం.యం.కీర‌వాణి సంగీతం అందిస్తుండగా.. ప్రముఖ సినిమాటోగ్రాఫ‌ర్ జ్ఞాన ‌శేఖ‌ర్ వి.ఎస్‌. సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 + nine =