శ్రీ (2005) మూవీతో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన తమన్నా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం, అభినయం తో సుమారు 17 సంవత్సరాలుగా ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. అద్భుత డ్యాన్స్ టాలెంట్ ఉన్న తమన్నా పలు మూవీస్ లో స్పెషల్ సాంగ్స్ లో పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. టాలెంటెడ్ యాక్ట్రెస్ తమన్నా ప్రస్తుతం చిరంజీవి భోళా శంకర్ మూవీలో కథానాయికగా నటిస్తున్నారు. తలైవా రజనీకాంత్ జైలర్ మూవీలో తమన్నా ఒక కీలక పాత్రకు ఎంపిక అయ్యారు. D 147 మూవీతో తమన్నా మలయాళ చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. తాజాగా తమన్నా ఒక బయోపిక్ మూవీకి ఎంపిక అయినట్టు సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా తమన్నా ఆధ్యాత్మిక సేవలో తరిస్తున్నారు. షూటింగ్స్ లేని సమయంలో ఆలయాలు తిరుగుతూ.. పూజలు నిర్వహిస్తూ తమన్నా ఆధ్యాత్మిక బాట పట్టారు. తాజాగా తమన్నా ఈశా యోగా ప్రాంగణానికి కాషాయ దుస్తుల్లో వెళ్లి అక్కడ ఉన్న లింగభైరవి దేవిని దర్శించుకుని , అమ్మవారికి హరతి ఇచ్చి ప్రత్యేక పూజలు చేశారు . ఇందుకు సంబంధించిన వీడియోను తమన్న తన ఇన్ స్టాలో షేర్ చేశారు . ఈశా యోగాశ్రమం నుంచి ఆహ్వానం రావడంతో ఎంతో సంతోషానికి గురయ్యాననీ , అమ్మవారిని దర్శించుకోవడం వల్ల మానసిక ఉల్లాసాన్ని కలిగించిందనీ ,అంతేకాకుండా.. జీవితంలో భయం, అపజయాల గురించి ఆందోళన దూరమయ్యిందనీ చెప్పారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


































