సూపర్ స్టార్ మహేష్ బాబు అప్పుడే బ్లాస్టర్ తో రికార్డులు క్రియేట్ చేయడం స్టార్ట్ చేశాడు. ఆయన పుట్టిన సందర్భంగా సర్కారు వారి పాట బ్లాస్టర్ అంటూ ఒక వీడియోను రిలీజ్ చేయగా అది సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయిందో చూశాం కదా. ముఖ్యంగా ఇందులో మహేష్ మరింత యంగ్‌గా, స్టైలిష్ లుక్‌తో కనిపించి ఫ్యాన్స్ ను ఖుష్ చేశాడు. ఇదిలా ఉండదా ఇప్పుడు ఈవీడియో కొత్త రికార్డులను క్రియేట్ చేస్తుంది. ‘సర్కారు వారి పాట’ టీజర్ విడుదలైన 24 గంటల్లో ఈ బ్లాస్టర్ ప్రోమోకు 25.7 మిలియన్ వ్యూస్, 7లక్షల 54వేల లైక్స్ వచ్చాయి. దీంతో టాలీవుడ్ హైయెస్ట్ వ్యూడ్ టీజర్‌గా రికార్డ్ క్రియేట్ చేసి మహేశ్ దూకుడు ఏ మాత్రం తగ్గలేదని ఈ టీజర్ మరో సారి నిరూపించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాాగా గీతా గోవిందం ఫేమ్ పరుశురాం దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఈసినిమాలో మహేష్ కు జోడీగా కీర్తి సురేష్ నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీయంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తున్నాయి. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇక ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను ముగించుకునే పనిలో పడింది. వచ్చే ఏడాది సంక్రాతికి సినిమాను రిలీజ్ చేయనున్నారు.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























