ఈమధ్య నితిన్ డిఫరెంట్ సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. రీసెంట్ గానే చెక్ లాంటి డిఫెరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి నితిన్ ఇప్పుడు రంగ్ దే లాంటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో వచ్చేస్తున్నాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో నితిన్ హీరోగా వస్తున్న సినిమా ‘రంగ్ దే’. మార్చి 26వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇక రిలీజ్ డేట్ కూడా దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించింది చిత్రయూనిట్. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ పలు పాటలు కూడా రిలీజ్ చేయగా నేడు ట్రైలర్ కూడా రిలీజ్ చేయనున్నారు. దీనికోసం కర్నూల్ లో ఓ కార్యక్రమం కూడా నిర్వహించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈసినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తిచేసుకుంది. ఈ సినిమాకు U/A సర్టిఫికెట్ ఇచ్చారు సెన్సార్ బృందం. ఇక సెన్సార్ రిపోర్ట్ ప్రకారం సినిమా ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఉందన్న పాజిటివ్ టాక్ వస్తుంది.
#RangDe is Certified with ‘U/A’ ⚡
Get ready for a roller coaster fun ride in 7 Days only at theatres near you 😍#RangDeOn26thMarch 🌈@actor_nithiin @KeerthyOfficial @pcsreeram @ThisIsDSP @dirvenky_atluri @vamsi84 @ShreeLyricist @adityamusic @SVR4446 pic.twitter.com/6r0MxHGrD2
— Sithara Entertainments (@SitharaEnts) March 19, 2021
కాగా ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. ఇంకా ఈ సినిమాలో సీనియర్ నటుడు నరేష్, వినీత్, రోహిణి, కౌసల్య, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, అభినవ్ గోమటం, సుహాస్, గాయత్రి రఘురామ్ తదితరులు నటిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు పి సి శ్రీరామ్ ఛాయాగ్రహణం సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:































