శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై సంపత్ నంది దర్శకత్వంలో యాక్షన్ చిత్ర హీరో గోపీచంద్ , తమన్నా జంటగా కబడ్డీ నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామా “సీటిమార్ “మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. హీరో ను ప్రేమించే అమ్మాయి పాత్రలో “హిప్పీ”మూవీ ఫేమ్ దిగాంగన నటిస్తుండగా రావు రమేష్ పోసాని , భూమిక , రెహమాన్ , తరుణ్ అరోరా ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఈ మూవీ లో గోపీచంద్ , తమన్నా లు కబడ్డీ టీమ్ కోచ్ లుగా నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




లాక్ డౌన్ ముందు 60 శాతం షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న “సీటిమార్ “మూవీ షూటింగ్ 8 నెలల తరువాత నిన్న(నవంబర్ 23 ) పునః ప్రారంభం అయ్యింది. ఈ షూటింగ్ షెడ్యూల్ తో “సీటిమార్ “మూవీ షూటింగ్ కంప్లీట్ కానుందని సమాచారం. దర్శకుడు సంపత్ నంది “ఉయ్ ఆర్ బ్యాక్ “అంటూ షూటింగ్ లొకేషన్ వీడియో ను సోషల్ మీడియా లో షేర్ చేశారు. హీరోయిన్ తమన్నా ఫస్ట్ టైమ్ స్పోర్ట్స్
బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న మూవీ లో నటించడం విశేషం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























