బ‌న్నీ, సుక్కు.. ఓ ఇంట్రెస్టింగ్ టైటిల్

Interesting Title For Allu Arjun And Sukumar Film

గ‌త చిత్రం `రంగ‌స్థ‌లం`తో కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్నాడు బ్రిలియంట్ డైరెక్ట‌ర్ సుకుమార్. రెండేళ్ళ విరామం అనంతరం.. ఇప్పుడు త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్ ని తెర‌కెక్కిస్తున్నాడు ఈ టాలెంటెడ్ డైరెక్ట‌ర్. `ఆర్య‌`, `ఆర్య 2` త‌రువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేష‌న్ లో సుకుమార్ రూపొందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. ఇప్ప‌టికే ఓ షెడ్యూల్ పూర్తిచేసుకుంది. కాగా, ఫిబ్ర‌వ‌రి మొద‌టి వారం నుండి రెండో షెడ్యూల్ ప్రారంభం కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

ఇదిలా ఉంటే..శేషాచ‌లం ప‌రిస‌ర ప్రాంతాల్లో సాగే సినిమా కావ‌డంతో `అల్లు అర్జున్ 20`కి `శేషాచ‌లం` అనే టైటిల్ ని ఫిక్స్ చేశార‌ట మేక‌ర్స్. ఎర్ర‌చంద‌నం అక్ర‌మ ర‌వాణా నేప‌థ్యంతో ఈ క్రేజీ ప్రాజెక్ట్ తెర‌కెక్క‌నుంది. మ‌రి.. గ‌త చిత్రం `రంగ‌స్థ‌లం` త‌ర‌హాలోనే టైటిల్ విష‌యంలో వైవిధ్యం ప్ర‌ద‌ర్శిస్తున్న సుక్కు.. తాజా చిత్రంతో ఎలాంటి ఫ‌లితాన్ని అందుకుంటాడో చూడాలి.

బ‌న్నీ స‌ర‌స‌న ర‌ష్మిక న‌టిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్ర‌సాద్ బాణీలు అందిస్తున్నాడు. మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ ఈ భారీ బ‌డ్జెట్ మూవీని తెర‌కెక్కిస్తోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.