నితిన్ కథానాయకుడిగా నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘అలియాస్ రుక్మిణి’ నుండి మేకర్స్ మరో ఆసక్తికరమైన అప్డేట్తో ముందుకు వచ్చారు. ఈ సినిమా నుంచి త్వరలోనే ఒక మంచి జోష్ ఉన్న ‘ఫస్ట్ సింగిల్’
రాబోతున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.ఇక అలాగే ఈనెల 13న ఈసినిమానుండి రుక్మిణిని పరిచయం చేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
“కృష్ణుడి ప్రేమకు ఒక కథ ఉంది” అనే ఆసక్తికరమైన క్యాప్షన్‌తో రాబోతున్న ఈ చిత్రానికి మురళి కాంత్ దేవోత్ దర్శకత్వం వహిస్తుండగా.. నేచురల్ స్టార్ నాని సమర్పణలో యునానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దీప్తి గంటా నిర్మిస్తున్నారు. జోమోన్ టి. జాన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, విజయ్ బుల్గానిన్ సంగీతం సమకూరుస్తున్నారు.
ఇప్పటికే డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానున్నట్లు ప్రకటించిన మేకర్స్, ఇప్పుడు ఈ పెప్పీ ఫస్ట్ సింగిల్ అనౌన్స్‌మెంట్‌తో ప్రమోషన్స్ జోరు పెంచారు. త్వరలోనే విడుదల కానున్న ఈ తొలి పాట మ్యూజికల్ ట్రీట్ ఎలా ఉండబోతుందోనని అటు నితిన్ అభిమానులు, ఇటు సినీ ప్రియులు ఎగ్జైటింగ్‌గా వెయిట్ చేస్తున్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























