ది ప్యారడైజ్ నుండి ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్

The Paradise First Single Promo Released

నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న ‘ది ప్యారడైజ్’చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ ‘ఆయా షేర్’ సాంగ్ ప్రోమో విడుదలైంది.ఇక ఈ ప్రోమో సాంగ్ పై అంచనాలు భారీగా పెంచేసింది. నాని జుట్టు పెంచి, రెండు జడలు వేసుకున్న రగ్గ్డ్ అండ్ మాస్ లుక్‌లో కనిపిస్తున్నారు.ఈ సాంగ్ లో ఆయన డ్యాన్స్ స్టెప్పులు అభిమానుల్లో పూనకాలు తెప్పించనున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రోమోలో వినిపిస్తున్న బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హై-వోల్టేజ్ ఎనర్జీతో ఉంది. కాసర్ల శ్యామ్ ఈ పాటకు సాహిత్యం అందించారు. “పొట్టు పొట్టు ఆకలి ఉంది.. ఆయా షేర్.. మెట్టు మెట్టు ఎక్కుతారా.. ఆయా షేర్” వంటి పవర్‌ఫుల్ పదాలు ప్రోమోలో ఆకట్టుకుంటున్నాయి.

ఈ పాట పూర్తి లిరికల్ వీడియోను రేపు, అంటే ఫిబ్రవరి 24న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగస్టు 21, 2026న ప్రపంచవ్యాప్తంగా 8 భాషల్లో విడుదల కానుంది.

ఈ చిత్రంలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు , రాఘవ్ జ్యూయెల్ ,సంపూర్ణేష్ బాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘దసరా’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.