మాస్ కా దాస్ విశ్వక్ సేన్, డైరెక్టర్ అనుదీప్ కేవీ కాంబినేషన్‌లో రాబోతున్న కామెడీ ఎంటర్‌టైనర్ ‘ఫంకీ’ నుండి అదిరిపోయే మాస్ అప్‌డేట్ వచ్చేసింది. ఈ సినిమాలోని మూడో సాంగ్ ‘యమ యమ్మ’ ఫుల్ వీడియో సాంగ్‌ను చిత్ర బృందం నేడు విడుదల చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
‘యమ యమ్మ’ అంటూ సాగే ఈ పాట పక్కా మాస్ బీట్‌తో ఉర్రూతలూగిస్తోంది. విశ్వక్ సేన్ తనదైన ఎనర్జిటిక్ స్టెప్పులతో రచ్చ చేయగా, హీరోయిన్ కయాదు లోహర్ కూడా గ్లామరస్‌గా కనిపిస్తూ ఆయనకు గట్టి పోటీ ఇచ్చింది.ఈ క్రేజీ మాస్ నంబర్‌కు భీమ్స్ సిసిరోలియో అదిరిపోయే సంగీతాన్ని అందించారు. ఈ పాటను దేవ్ పవార్ రచించగా, భీమ్స్ సిసిరోలియో మరియు రోహిణి సోరత్ తమ వాయిస్‌తో మరింత జోష్ నింపారు.
ఇప్పటికే విడుదలైన ‘ధీరే ధీరే’ (మెలోడీ), ‘రట్టాటటావ్’ (ఫన్ సాంగ్) పాటలకు మంచి రెస్పాన్స్ రాగా, ఇప్పుడు వచ్చిన ఈ మూడో సాంగ్ మాస్ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తోంది. ఈసినిమా వాలెంటైన్స్ వీక్ సందర్భంగా ఫిబ్రవరి 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతోంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























