యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్న సరికొత్త చిత్రం ‘ఫ్రెండ్లీ కపుల్’.ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే కానుకగా ఈ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో, ప్రమోషన్లలో భాగంగా చిత్ర యూనిట్ నేడు సెకండ్ సింగిల్ ‘గాబరా గాబరా’సాంగ్‌ను విడుదల చేసింది.ఈ పాటను ప్రముఖ సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ పాడటం విశేషం. ఆదిత్య రవీంద్రన్ స్వరపరిచిన ట్యూన్స్ , రాకేందు మౌళి అందించిన లిరిక్స్ యువతను ఆకట్టుకునేలా ఉన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మిస్ ఇండియా మానస వారణాసి కథానాయికగా నటిస్తోంది. ఒక యువ జంట మధ్య ఉండే రోజువారీ సరదా సంఘటనలు, గొడవలు మరియు ప్రేమను ఈ సినిమాలో ఎంతో సహజంగా చూపించబోతున్నారు. యూవీ కాన్సెప్ట్స్ సమర్పణలో వస్తున్న ఈ సినిమాను ఫిబ్రవరి 14న తెలుగు మరియు తమిళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
రొమాంటిక్ కామెడీ చిత్రాలను ఇష్టపడే ప్రేక్షకులకు ‘ఫ్రెండ్లీ కపుల్’ ఒక మంచి వినోదాన్ని అందిస్తుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది.ఇప్పటికే విడుదలైన టీజర్ మరియు ఫస్ట్ సింగిల్ ‘నాలో నేను’ పాటకు మంచి రెస్పాన్స్ రాగా, తాజా సాంగ్‌తో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























