నేచురల్ స్టార్ నాని, క్రియేటివ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబోలో వచ్చిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ‘సరిపోదా శనివారం’. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా, SJ సూర్య పవర్‌ఫుల్ రోల్‌లో నటించిన ఈ చిత్రాన్ని డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్, భారీ కాన్వాస్‌తో నిర్మించారు. ఇక ఆగస్ట్ 29న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదలైన విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఫస్ట్ షో నుంచే అద్భుతమైన రెస్పాన్స్ అందుకున్న ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని, హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా టీమ్ సక్సెస్ మీట్ నిర్వహించింది. నిర్మాత దిల్ రాజు, దర్శకులు హను రాఘవపూడి, శివ నిర్వాణ, రాహుల్ సంకృత్యాన్ ప్రత్యేక అతిధులుగా హాజరయ్యారు. చిత్ర యూనిట్ సభ్యులంతా పాల్గొన్న ఈ విజయ వేడుక చాలా ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు వివేక్ ఆత్రేయ మాట్లాడుతూ.. “ఈ వేడుకకు విచ్చేసిన శివ, హను అన్న, రాహుల్, దిల్ రాజు గారికి థాంక్ యూ. నాని సినిమాలో ఒక సీన్ ప్లే అవుతున్నపుడు ఆడియన్స్ థియేటర్స్ లో పేపర్స్ వేస్తారని నేను ఎప్పుడూ ఊహించలేదు. నాని గారు నన్ను అలా చూడాలని అనుకున్నారు. నాకు నామీద వున్న నమ్మకం కంటే నాని గారికి నా మీద వున్న నమ్మకం ఎక్కువ” అని తెలిపారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. “ఇండస్ట్రీలో16 ఏళ్ళు పూర్తి చేసుకున్న నాని గారికి అభినందనలు. నాలుగేళ్ళుగా ఆయన్ని దగ్గర నుంచి చూస్తున్నాను. సినిమానే ఆయన ప్రాణం. సినిమాకి ఆయన ఇచ్చిన సపోర్ట్ మామూలుది కాదు. సినిమా కోసం అందరూ అహర్నిశలు కష్టపడ్డారు. ఈ సక్సెస్ కి టీం అందరిది. నా డైరెక్షన్ టీం అందరికీ పేరుపేరునా థాంక్ యూ. ఈసారి గట్టిగా కొట్టాం” అని చెప్పారు.
“నేను రాసిన దానికంటే అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన నాని గారు, సూర్య గారు, ప్రియాంక, సాయి కుమార్ గారు.. అందరికీ పేరుపేరునా థాంక్ యూ. జేక్స్ బిజోయ్ సినిమా మరో స్థాయిలో నిలబెట్టాడు. శేఖర్ గారు అద్భుతమైన సెట్ వేశారు. నాని గారితో మళ్ళీ మళ్ళీ వర్క్ చేయాలని వుంది. నాని గారు మా అందరికీ చాలా ప్రౌడ్ గా ఫీల్ చేయిస్తున్నారు. థాంక్ యూ సో మచ్” అని అన్నారు డైరెక్టర్ వివేక్ ఆత్రేయ.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:

































