‘సరిపోదా శనివారం’ సినిమాతో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన నేచురల్ స్టార్ నాని అప్పుడే తన తదుపరి చిత్రాన్ని పట్టాలెక్కించేసాడు. బ్లాక్ బస్టర్ ఫ్రాంఛైజీ ‘హిట్’ సిరీస్ చిత్రాలలో భాగంగా మూడో సినిమాగా తెరకెక్కుతోన్న ‘హిట్ 3: ది థర్డ్ కేస్’ మూవీలో ఆయన నటిస్తున్నాడు. నాని 32వ చిత్రంగా రూపొందనున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా బిగ్ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ టీజర్‌ని గురువారం విడుదల చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా సోషల్ మీడియాలో హీరో నాని ఇలా తెలిపారు.. “”పోలీసుకి తక్కువ.. క్రిమినల్ కి ఎక్కువ. బాధ్యతలు స్వీకరించిన అర్జున్ సర్కార్. నాని హిట్ ది థర్డ్ కేస్, బ్లడ్ గేట్‌లు మే 1, 2025న తెరవబడతాయి” అని అందులో పేర్కొన్నారు. కాగా ఈ సినిమాలో నేచురల్ స్టార్ క్రూయల్ కాప్ అర్జున్ సర్కార్‌గా కనిపించనున్నాడు. శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని హీరో నాని హోం బ్యానర్ ‘వాల్ పోస్టర్ సినిమా’ నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ టీజర్ టాప్‌లో ట్రెండ్ అవుతోంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: