
సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు


'సరిపోదా శనివారం' సినిమాతో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన నేచురల్ స్టార్ నాని అప్పుడే తన తదుపరి చిత్రాన్ని పట్టాలెక్కించేసాడు. బ్లాక్ బస్టర్ ఫ్రాంఛైజీ ‘హిట్’ సిరీస్ చిత్రాలలో భాగంగా మూడో సినిమాగా తెరకెక్కుతోన్న 'హిట్ 3: ది థర్డ్ కేస్' మూవీలో ఆయన నటిస్తున్నాడు. నాని 32వ చిత్రంగా రూపొందనున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా బిగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా అనౌన్స్మెంట్ టీజర్‌ని గురువారం విడుదల చేశారు.