
ట్యాగ్ · 4 కథనాలు


దేవర.. ఆడియెన్స్‌కు గుడ్‌న్యూస్
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ రోల్‌లో నటించిన లేటెస్ట్ మూవీ 'దేవర'. తారక్ సోలో హీరోగా వచ్చి దాదాపు ఆరేళ్ళు కావడం, అలాగే 'ఆర్ఆర్ఆర్' తర్వాత స్క్రీన్ పైన కనిపించి రెండేళ్లకు పైగా అవడంతో ఆయన అభిమానులు సినిమా చూసేందుకు థియేటర్లకు పరుగులుతీశారు. విడుదలకు ముందే భారీ హైప్ తెచ్చుకున్న దేవర చిత్రం అంచనాలకు తగ్గట్టుగానే బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టిస్తోంది.

దేవర దావుదీ సాంగ్ కు సూపర్ రెస్పాన్స్
దేవర ఆడియో సాంగ్స్ యూట్యూబ్ లో వ్యూస్ పరంగా అదరగొడుతున్నాయి.ఇంతకుముందు వచ్చిన సెకండ్ సాంగ్ చుట్టమల్లే సింగిల్ లాంగ్వేజ్ లోనే 100 మిలియన్లకు పైగా వ్యూస్ ను రాబట్టుకొని చార్ట్ బాస్టర్ అయ్యింది.అలాగే ఫస్ట్ సాంగ్ ఫియర్ అన్ని భాషల్లో కలుపుకొని 70మిలియన్లకు పైగా వ్యూస్ ను తెచ్చుకుంది.ఇక ఈసినిమా నుండి నిన్న మూడో పాట దావూదీని రిలీజ్ చేశారు.ఈసాంగ్ కూడా రెస్పాన్స్ అదిరిపోతుంది.24గంటల్లో అన్నిభాషల్లో కలిపి 30మిలియన్లకు పైగా వ్యూస్ ను రాబట్టుకుంది.త్వరలోనే ఈసాంగ్ కూడా 100మిలియన్ల వ్యూస్ ను రాబట్టుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.

దేవర.. థర్డ్ సింగిల్ వచ్చేసింది
యంగ్ టైగర్ ఎన్టీఆర్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం విడుదలకు ముందే ప్రపంచ వ్యాప్తంగా సంచలనాలను సృష్టిస్తోంది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా.. మరో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో, నరైన్ తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు.

దేవర నుండి ఈసారి వీడియో సాంగ్
ఎన్టీఆర్ దేవర నుండి ఇప్పటివరకు వచ్చిన రెండు పాటలు ఒకదాన్ని మించి మరొకటి చార్ట్ బాస్టర్ అయ్యాయి.దాంతో మూడో పాట పై అంచనాలు భారీగా వున్నాయి.ఇక ఈ మూడో సాంగ్ దావూది రేపు రిలీజ్ కానుంది.అయితే లిరికల్ వీడియో కాకుండా ఏకంగా వీడియో సాంగ్ నే రిలీజ్ చేస్తున్నారు.అనిరుధ్ ట్యూన్స్ కు ఎన్టీఆర్ ,జాన్వీ కపూర్ వేసే స్టెప్స్ అదిరిపోనున్నాయట.ఈసందర్భంగా అందులోని డ్యాన్స్ స్టిల్ ను రిలీజ్ చేశారు.మరి ఈసాంగ్ ఏ రేంజ్ లో రచ్చ చేస్తుందో చూడాలి.