టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి చిన్న చిన్న పాత్రలు చేసి ఇప్పుడు హీరో అయ్యాడు. ఇక తన సినిమాలతో విభిన్నమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇటీవల కృష్ణమ్మ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఆసినిమా ఒక మోస్తరు విజయాన్ని అందించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఇప్పుడు ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో సత్యదేవ్ హీరోగా ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. జీబ్రా అనే టైటిల్ తో ఈసినిమా వస్తుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. అయితే చాలా రోజుల తరువాత ఈసినిమా నుండి ఒక అప్ డేట్ వచ్చింది. నేడు సత్యదేవ్ పుట్టినరోజు సందర్భంగా ఈసినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మూవీలో సత్య సూర్య అనే పాత్రలో కనిపించబోతున్నాడు.
కాాగా ఈసినిమాలో ప్రియా భవాని శంకర్ ఈసినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా ఈ చిత్రంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్పతో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్న కన్నడ స్టార్ డాలీ ధనంజయ మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఓల్డ్ టౌన్ పిక్చర్స్ ప్రొడక్షన్ నంబర్ 1 గా నిర్మాతలు బాల సుందరం, దినేష్ సుందరం క్రైమ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మణికంఠన్ కృష్ణమాచారి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, చరణ్ రాజ్ సంగీతం సమకూరుస్తున్నారు. మీరాఖ్ డైలాగ్స్ అందిస్తున్న ఈ చిత్రానికి అనిల్ క్రిష్ ఎడిటర్ గా పని చేస్తున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























