
ట్యాగ్ · 2 కథనాలు


తండేల్- దసరా తర్వాతే క్లారిటీ
నాగ చైతన్య చందూ మొండేటి దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. తండేల్ అనే టైటిల్ తో ఈసినిమా వస్తుంది. మత్స్యకారుడు గణగల్ల రామరావు జీవితాన్ని ఈసినిమా ద్వారా చూపిస్తున్నారు. ఇక యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈసినిమా కోసం నాగచైతన్య తన మేకోవర్ ను పూర్తిగా మార్చేశాడు. ఇక ఈసినిమా నుండి ఇప్పటికే గ్లింప్స్ ను రిలీజ్ చేయగా గ్లింప్స్ కు మంచి రెస్పాన్సే వచ్చింది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉంది.

తండేల్ నుండి సాయి పల్లవి బర్త్ డే స్పెషల్ వీడియో రిలీజ్
చందూ మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య, సాయిపల్లవి కాంబినేషన్ లో వస్తున్న సినిమా తండేల్. లవ్ స్టోరీ తర్వాత నాగచైతన్య, సాయిపల్లవి కాంబోలో వస్తోన్న రెండో సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈసినిమా వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతుంది. సముద్రంలో చేపల వేటకు వెళ్లి అనుకోకుండా పాకిస్తాన్ జలాల్లోకి వెళ్లి అక్కడి అధికారులకు పట్టుబడ్డ భారత మత్స్యకారుల కథే ఈసినిమా. ఇందులో నాగచైతన్య ఓ జాలరి పాత్రలో కనిపించబోతుండగా, పల్లెటూరి అమ్మాయిగా సాయిపల్లవి నటిస్తోంది.