
ట్యాగ్ · 2 కథనాలు


తండేల్ నుండి సాయి పల్లవి బర్త్ డే స్పెషల్ వీడియో రిలీజ్
చందూ మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య, సాయిపల్లవి కాంబినేషన్ లో వస్తున్న సినిమా తండేల్. లవ్ స్టోరీ తర్వాత నాగచైతన్య, సాయిపల్లవి కాంబోలో వస్తోన్న రెండో సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈసినిమా వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతుంది. సముద్రంలో చేపల వేటకు వెళ్లి అనుకోకుండా పాకిస్తాన్ జలాల్లోకి వెళ్లి అక్కడి అధికారులకు పట్టుబడ్డ భారత మత్స్యకారుల కథే ఈసినిమా. ఇందులో నాగచైతన్య ఓ జాలరి పాత్రలో కనిపించబోతుండగా, పల్లెటూరి అమ్మాయిగా సాయిపల్లవి నటిస్తోంది.

సాయి పల్లవి "శ్యామ్ సింగ రాయ్ "ఫస్ట్ లుక్ రిలీజ్
టాలెంటెడ్ యాక్ట్రెస్ సాయి పల్లవి తన యాక్టింగ్ , డ్యాన్సింగ్ స్కిల్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుని సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా కొనసాగుతున్నారు. తెలుగు , తమిళ , మలయాళ భాషా చిత్రాలతో ప్రేక్షకులను సాయి పల్లవి అలరిస్తున్నారు. సాయి పల్లవి కథానాయికగా రూపొందిన "లవ్ స్టోరీ ", "విరాటపర్వం " మూవీస్ కరోనా సెకండ్ వేవ్ కారణంగా విడుదల వాయిదా పడ్డాయి . "లవ్ స్టోరీ "మూవీ లో సాయి పల్లవి పెర్ఫార్మ్ చేసిన "సారంగదరియా"సాంగ్ కు ప్రేక్షకులనుండి అద్భుత స్పందన లభించింది.