
ట్యాగ్ · 2 కథనాలు

భారీ వర్షాలపై విజయ్ దేవరకొండ స్పందన

విజయ్ దేవరకొండ బర్త్ డేన రానున్న అప్డేట్స్ ఇవే
రీసెంట్ గా ది ఫ్యామిలీ స్టార్ తో పలకరించిన యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం తన 12వ సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యాడు.నిన్న ఈసినిమా కొత్త షెడ్యూల్ వైజాగ్ లో స్టార్ట్ అయ్యింది.జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తున్నాడు.గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ లో వస్తుంది.అనిరుధ్ సంగీతం అందిస్తుండగా హీరోయిన్ విషయం లో క్లారిటీ రావాల్సివుంది.సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది.ఇక ఈనెల 9న విజయ్ తన బర్త్ డేను జరుపుకోనున్నాడు.ఈ సందర్భంగా ఈసినిమా నుండి అప్డేట్ రానుంది.టైటిల్ ను ప్రకటించే ఛాన్స్ వుంది.
భారీ వర్షాలపై విజయ్ దేవరకొండ స్పందన
గత వారం రోజులుగా కురిసిన భారీ వర్షాలకు హైదరాబాద్ నగరం అతలాకుతలం అయ్యింది. జన జీవనం అస్తవ్యస్త మైంది. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. వందకు పైగా కాలనీలు జలదిగ్బంధంలో ఉన్నాయి . ఇళ్ళు కూలిపోయి , వాహనాలు కొట్టుకుపోయి , నిత్యావసరాలు తడిచిపోయి ప్రజలు తిండి , నిద్ర లేక అలమటిస్తున్నారు. వాగులు , వంకలు పొంగి , చెరువు కట్టలు తెగి తెలంగాణలో పంట పొలాలు నీట మునిగి రైతులకు తీవ్ర నష్టం కలిగించాయి. నాలాలు పొంగి పొర్లాయి. మూసీ నది విశ్వరూపం దాల్చింది. పోలీసుల సాయంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు జిహెచ్ఎంసి తరలిస్తోంది. మరో మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని…