
ట్యాగ్ · 4 కథనాలు


టీ సిరీస్ చేతికి మిస్టర్ బచ్చన్

యూఎస్ కు వెళ్లనున్న మిస్టర్ బచ్చన్ టీం

మిస్టర్ బచ్చన్ షూటింగ్ అప్ డేట్

మిస్టర్ బచ్చన్ టీజర్ వచ్చేస్తోంది
మాస్ మహారాజ రవితేజ ప్రధానపాత్రలో నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'మిస్టర్ బచ్చన్'. టాలీవుడ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రవితేజ సరసన భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్‍గా నటిస్తోంది. జగపతి బాబు, సచిన్ ఖేడేకర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రచార చిత్రాలు మంచి రెస్పాన్స్ దక్కించుకున్నాయి.

టీ సిరీస్ చేతికి మిస్టర్ బచ్చన్
మాస్ మహారాజా రవితేజ -హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న మూడవ చిత్రం మిస్టర్ బచ్చన్.సెట్స్ మీదకు వెళ్ళినప్పటి నుండి నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకుంటుంది.ఇంకో 20శాతం షూటింగ్ బ్యాలెన్స్ వుంది.ఈనెలలో దాన్నికూడా ఫినిష్ చేయనున్నారు.ఇక ఈసినిమా ఆడియో హక్కులను టీ సిరీస్ దక్కించుకుంది.త్వరలోనే ఫస్ట్ సింగిల్ విడుదలకానుంది.రీసెంట్ గా దానికి సంబంధించిన ప్రోమోను కూడా రిలీజ్ చేశారు.

యూఎస్ కు వెళ్లనున్న మిస్టర్ బచ్చన్ టీం
హరీష్ శంకర్,మాస్ మహా రాజా రవితేజ కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా మిస్టర్ బచ్చన్.ఇందులో రవితేజ ప్రభుత్వ ఉద్యోగి గా కనిపించనున్నాడు.సగానికి పైగా షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది .ఇక నెక్స్ట్ షెడ్యూల్ కోసం టీం యూఎస్ వెళ్లనున్నారు.ఈ షెడ్యూల్ లో సాంగ్స్ తోపాటు కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.దాంతో సినిమా దాదాపు పూర్తయినట్లే.

మిస్టర్ బచ్చన్ షూటింగ్ అప్ డేట్
మాస్ మహారాజా రవితేజ మాత్రం జయాపజయాలతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే ఈగల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈసినిమా డీసెంట్ హిట్ నే అందించింది. ఇప్పుడు పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న మిస్టర్ బచ్చన్ సినిమా కూడా ఒకటి. ఈసినిమా షూటింగ్ ను కూడా రీసెంట్ గానే ప్రారంభించారు మేకర్స్.