బ్లాక్ బస్టర్ ఫిదా మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన సాయి పల్లవి నటించిన తక్కువ సినిమాలే అయినా.. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. సాయి పల్లవి తన డ్యాన్స్ , నటనలతో ప్రేక్షకులను అలరించిన శ్యామ్ సింగరాయ్, విరాట పర్వం చిత్రాలకు ఆమె ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ సైతం అందుకున్నారు. ప్రస్తుతం సాయి పల్లవి ఏ మూవీ కి కమిట్ కాలేదు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
బ్లాకీ జెనియే , మై లెఫ్ట్ ఫుట్ బ్యానర్స్ పై గౌతమ్ రామచంద్రన్ దర్వకత్వంలో టాలెంటెడ్ యాక్ట్రెస్ సాయి పల్లవి ప్రధాన పాత్రలో ఒక యదార్ధ సంఘటన ఆధారంగా , ఉమెన్ సెంట్రిక్ మూవీ గా తమిళ, తెలుగు , కన్నడ భాషలలో తెరకెక్కిన గార్గి మూవీ జులై 15 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి భారీ వసూళ్ల తో కమర్షియల్ హిట్ గా నిలిచింది.టాలెంటెడ్ యాక్ట్రెస్ సాయి పల్లవి గార్గి మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.గార్గి మూవీ వారం రోజులలోనే బ్రేక్ ఈవెన్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. గార్గి మూవీ లో సాయి పల్లవి అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల , విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. తాజాగా ఈ మూవీ లో నటనకు సాయి పల్లవి క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్ లో బెస్ట్ యాక్ట్రెస్ గా ఎంపిక అయ్యారు. ఈ అవార్డ్ ప్రధానోత్సవాల కోసం సాయి పల్లవి ముంబై వెళ్ళారు .అందుకు సంబంధించిన ఫోటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: