మణిరత్నం కోసం కమల్

kamal haasan to attend ponniyin selvan 2 trailer and audio launch event

మణిరత్నం దర్శకత్వంలో భారీ తారాగణంతో, భారీ బడ్జెట్ తో వచ్చిన సినిమా పొన్నియన్ సెల్వన్. నిజానికి ఈసినిమాను ముందు ఒకే సినిమాగా రిలీజ్ చేద్దామని అనుకున్నారు. కానీ ఆతరువాత రెండు పార్ట్ లుగా రిలీజ్ చేస్తున్నట్టు అప్పుడే ప్రకటించారు. ఇక ఫస్ట్ పార్ట్ ఇప్పటికే రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. చోళుల నేపథ్యంలో ఈసినిమాను భారీగా తెరకెక్కించాడు మణిరత్నం. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈసినిమా సూపర్ హిట్ ను అందించింది. ఈసినిమా సూపర్ హిట్ ను అందించడమే కాకుండా.. భారీ కలెక్షన్స్ ను అందుకుంది. దాదాపు 450 కోట్లకు పైగా వసూలు చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక సెకండ్ పార్ట్ ఏప్రిల్ 28వ తేదీన భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. దీనిలో భాగంగానే ఈసినిమా ప్రమోషన్స్ ను ఇప్పటికే మొదలుపెట్టారు చిత్రయూనిట్. ఇప్పటికే ఈసినిమా నుండి ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు. తాజాగా ఈసినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసి ప్రకటించారు. ట్రైలర్ ను మార్చి 29వ తేదీన రిలీజ్ చేయనున్నారు. ఈ మూవీ ట్రైల‌ర్‌, ఆడియో లాంచ్‌ను చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఘ‌నంగా జ‌రగ‌నుంది. ఈనేపథ్యంలో తాజాగా ఇప్పుడు మరో అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా ట్రైలర్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా కమల్ హాసన్ రానున్నారు.

కాగా ఈసినిమాలో విక్రమ్, కార్తీ, త్రిష, పార్తిబన్, ఐశ్వర్యా రాయ్ బచ్చన్, జయరామ్, జయం రవి తదితరులు కీలకపాత్రల్లో నటించారు. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంయుక్తంగా నిర్మించాయి. తమిళంతో పాటు హిందీ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ఈసినిమా రిలీజ్ కానుంది.  ఈసినిమాకు ఏ.ఆర్ రెహమాన్ సంగీతం అందించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − twelve =