
ట్యాగ్ · 3 కథనాలు


ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి టీజర్ రిలీజ్

ఫలానా అమ్మాయి ఫలానా అబ్బాయి ఎందుకు చూడాలంటే ..
చాలా రోజుల నుండి ఓ సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు యంగ్ హీరో నాగశౌర్య. ఈ హీరో నటించిన తాజా చిత్రం 'ఫలానా అమ్మాయి ఫలానా అబ్బాయి'. శ్రీనివాస్ అవసరాల దర్శకుడు, మాళవిక నాయర్ హీరోయిన్. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో సినిమా కు మంచి హైప్ వచ్చింది. ఈ శుక్రవారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాను ఎందుకుచుడాలో ఇప్పుడు తెలుసుకుందాం.

సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి
దాసరి ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్ పై శ్రీనివాస్ అవసరాల దర్శకత్వం లో నాగ శౌర్య , మాళవిక నాయర్ జంట గా తెరకెక్కిన లేటెస్ట్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి మూవీ ఈ నెల 17 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీలో శ్రీనివాస్ అవసరాల, మేఘ చౌదరి, అశోక్ కుమార్, అభిషేక్ మహర్షి, శ్రీ విద్య, వారణాసి, సౌమ్య చలంచర్ల, హరిణి రావ్, అర్జున్ ప్రసాద్ ముఖ్య పాత్రలలో నటించారు. కళ్యాణి మాలిక్ సంగీతం అందించారు. .

ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి టీజర్ రిలీజ్
సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్న హీరోల్లో టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య కూడా ఒకరు. ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు తెరకు హీరోగా పరిచయమైన నాగశౌర్య మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఆ తరువాత వరుసగా సినిమాలు చేసుకుంటూనే వెళుతున్నాడు. ఈమధ్యనే కృష్ణ వ్రింద విహారి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి డీసెంట్ హిట్ ను అందుకున్నాడు నాగశౌర్య. ఇక ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాడు. శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా వస్తున్న సినిమా ఫలానా అబ్బాయి.. ఫలానా అమ్మాయి. ఈసినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో ఈసినిమా…