7 డిఫరెంట్ లుక్స్ తో అదరగొడుతున్న నాగశౌర్య

naga shourya seven different looks in phalana abbayi phalana ammayi

టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య జయాపజయాలను పట్టించుకోకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. అంతేకాదు ఇప్పుడు విభిన్నమైన పాత్రలు చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ప్రస్తుతం తన నుండి వస్తున్న సినిమా ఫలానా అబ్బాయి.. ఫలానా అమ్మాయి. శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది ఈసినిమా మార్చి 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ కు అలానే పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చి సినిమాపై అంచనాలను పెంచేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఈసినిమాలో నాగశౌర్య ఒకటి కాదు రెండు కాదు దాదాపు 7 డిఫరెంట్ లుక్స్ తో అదరగొడుతున్నట్టు తెలుస్తుంది. సెవెన్ లుక్స్, అంతులేని అవకాశాలు.. ఒక నటుడిగా గ్లామర్ ఫీల్డ్ లో వచ్చే ఇబ్బందులు నాకు తెలుసు.. కానీ ప్రతి సవాలు నాకు క్రాఫ్ట్ పట్ల అభిరుచిని మాత్రమే పెంచుతాయి.

 

View this post on Instagram

 

A post shared by Naga Shaurya (@actorshaurya)

కాగా ఈసినిమాలో నాగశౌర్యకు జోడీగా మాళవిక హీరోయిన్ గా నటిస్తుంది. గతంలో నాగశౌర్యతో కలిసి ‘కళ్యాణ వైభోగమే సినిమా చేయగా ఇప్పుడు ఈసినిమాలో మరోసారి జతకడుతుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ పై టి.జి.విశ్వప్రసాద్, దాసరి పద్మజ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సునీల్ కుమార్ సినిమాటోగ్రఫి అందిస్తున్నారు. ఈసినిమా మార్చి 17న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.

కాగా శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఊహలు గుసగుసలాడే, జ్యో అచ్యుతానందా వంటి క్లాసికల్‌ లవ్‌స్టోరీల తర్వాత హీరో నాగశౌర్య, శ్రీనివాస్‌ అవసరాల కాంబోలో సినిమా తెరకెక్కుతుండటంతో ప్రేక్షకుల్లో మంచి అంచనాలే నెలకొన్నాయి. మరి ఈసినిమా వీరిద్దరికీ మరో హిట్ ను ఇస్తుందేమో చూడాలి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 5 =