చెప్పిన డేట్ కే వచ్చేస్తున్న ధమ్కీ

dhamki movie team confirm release date once again

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ మాస్ సినిమాలు, క్లాస్ సినిమాలు చేస్తూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ఈమధ్య అశోకవనంలో అర్జున కళ్యాణం, ఓరి దేవుడా లాంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈరెండు సినిమాల్లో కూడా విశ్వక్ కూల్ లుక్ లో అలరించాడు. ఇక ఇప్పుడు మరోసారి మాస్ పాత్రలో వచ్చేస్తున్నాడు. విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. ఈసినిమాలో రెండు డిఫరెంట్ పాత్రల్లో విశ్వక్ సేన్ అలరిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన రెండు ట్రైలర్ లు కూడా సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇక మరోవైపు చిత్రయూనిట్ ప్రమోషన్స్ లో జోరు పెంచింది. అయితే ఇప్పుడు మరోసారి చెప్పిన డేట్ కే వస్తున్నట్టు కన్ఫామ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమాను ముందు ఫిబ్రవరిలో రిలీజ్ చేద్దామనుకున్న సంగతి తెలిసిందే. అయితే అప్పటికి పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ అవ్వకపోవడంతో ఈసినిమా రిలీజ్ డేట్ ను వాయిదా వేశారు. మార్చి 22వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. తాజాగా ఈసినిమాకు సంబంధించి ఒక అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాకి సంబంధించిన ఫైనల్ మిక్సింగ్ కూడా పూర్తయిందని చెబుతూ, రిలీజ్ డేట్ విషయంలో ఎలాంటి డౌట్ లేదనే విషయంలో క్లారిటీ ఇచ్చారు.

కాగా ఈసినిమాలో నివేదా పేతురాజు హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా ఈ సినిమాలో రావు రమేష్, రోహిణి, హైపర్ ఆది, పృథ్వీరాజ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాకు బెజవాడ ప్రసన్నకుమార్ కథని.. లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను కరాటే రాజు నిర్మిస్తున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one − 1 =