
రిలీజ్ అప్‌డేట్
ట్యాగ్ · 1 కథనాలు


టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ మాస్ సినిమాలు, క్లాస్ సినిమాలు చేస్తూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ఈమధ్య అశోకవనంలో అర్జున కళ్యాణం, ఓరి దేవుడా లాంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈరెండు సినిమాల్లో కూడా విశ్వక్ కూల్ లుక్ లో అలరించాడు. ఇక ఇప్పుడు మరోసారి మాస్ పాత్రలో వచ్చేస్తున్నాడు. విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. ఈసినిమాలో రెండు డిఫరెంట్ పాత్రల్లో విశ్వక్ సేన్ అలరిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన రెండు ట్రైలర్ లు కూడా సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇక మరోవైపు చిత్రయూనిట్ ప్రమోషన్స్ లో జోరు పెంచింది. అయితే ఇప్పుడు మరోసారి చెప్పిన డేట్ కే వస్తున్నట్టు కన్ఫామ్ చేశారు.