విట్టి దండు (2014 ) మరాఠీ మూవీతో కెరీర్ ప్రారంభించిన మృణాల్ ఠాకూర్ లవ్ సోనియా మూవీతో బాలీవుడ్ కు పరిచయం అయ్యారు. పలు సూపర్ హిట్ మూవీస్ తో బాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన మృణాల్ సీతారామం మూవీతో టాలీవుడ్ కు పరిచయం అయిన విషయం తెలిసిందే. ఆ మూవీలో సీత పాత్రలో తన అందం, అభినయంతో మృణాల్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సీతారామం మూవీ సక్సెస్ తో మృణాల్ పలు అవకాశాలు అందుకుంటున్నారు. వైరా ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై శౌర్యువ్ దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కనున్న# NANI 30 మూవీలో మృణాల్ కథానాయికగా ఎంపిక అయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మృణాల్ ఠాకూర్ కథానాయికగా తెరకెక్కిన 3 బాలీవుడ్ మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. స్టార్ హీరో అక్షయ కుమార్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న సెల్ఫీ హిందీ మూవీలో మృణాల్ అతిధి పాత్రలో నటిస్తున్నారు. మలయాళ సూపర్ హిట్ డ్రైవింగ్ లైసెన్స్ మూవీ హిందీ రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ లో సినీ తారగా నటిస్తున్న మృణాల్, అక్షయ్ కుమార్ తో ఒక సాంగ్ లో పాల్గొన్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: