
ట్యాగ్ · 3 కథనాలు

బెదురులంక 2012 మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే చిత్రం - కార్తికేయ
సి.యువరాజు సమర్పణలో లౌక్య ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై క్లాక్స్ దర్శకత్వం లో కార్తికేయ హీరోగా కామెడీ ఎంటర్ టైనర్ బెదురులంక 2012 మూవీ తెరకెక్కిన విషయం తెలిసిందే. గోదావరి బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన ఈ మూవీలో డీజే టిల్లు ఫేమ్ నేహాశెట్టి హీరోయిన్ కాగా అజయ్ ఘోష్, సత్య, రాజ్ కుమార్ కసిరెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్, ఆటో రాంప్రసాద్, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్, సురభి ప్రభావతి, కట్టయ్య, అనిథనాథ్, దివ్య నార్ని ముఖ్య పాత్రలలో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు.

బెదురులంక 2012 టీజర్ రిలీజ్
టాలీవుడ్ ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన ఈతరం హీరోల్లో యంగ్ హీరో కార్తికేయ కూడా ఒకరు. ఆర్ఎక్స్ 100 అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కార్తికేయ మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. ఇక ఆసినిమా తరువాత వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని హీరోగా నిలదొక్కుకోగలిగాడు. కేవలం హీరోగా మాత్రమే కాదు పలు సినిమాల్లో కీలక పాత్రల్లో నటించడానికి కూడా ఏమాత్రం వెనుకాడకుండా కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం అయితే కార్తికేయ నుండి వస్తున్న సినిమా బెదురులంక 2012. క్లాక్స్ దర్శకత్వంలో బెదురులంక అనే ఊరిలో 2012లో యుగాంతం వస్తుందన్న పుకార్లు ఎలాంటి పరిణామాలు తీసుకొచ్చాయి అనే నేపథ్యంలో ఈ మూవీ…

బెదురులంక 2012- టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ ఎప్పటినుండో మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. క్లాక్స్ దర్శకత్వంలో కార్తికేయ హీరోగా వస్తున్న సినిమా బెదురులంక 2012. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో 2012 యుగాంతం నేపథ్యంలో ఈసినిమా రూపొందుతుందన్న విషయం తెలిసిందే కదా. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇప్పటివరకూ ఈసినిమా నుండి పలు పోస్టర్లు, అలానే గ్లింప్స్ ను మాత్రమే రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఇప్పుడు ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేయడానికి సిద్దమయ్యారు. తాజాగా ఈసినిమా టీజర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ ప్రకటించారు చిత్రబృందం. ఈసినిమా టీజర్ ను…